News


10800 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 28th February 2019
Markets_main1551349884.png-24381

మూడోరోజూ నష్టాలే..!
భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌ 10800 మార్కును కోల్పోయింది. నేడు ఫిబ్రవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల చివరిరోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపరిచింది. సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టపోయి 35,867 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లను నష్టపోయి 10,792.50 వద్ద స్థిరపడింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల పతనంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 26,878 వద్ద ముగిసింది. రేపు ఫిబ్రవరి వాహన విక్రయ గణంకాలు వెల్లడి కానుండంతో అటో షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గుదల లాంటి సానుకూల అంశాలతో నేడు మార్కెట్‌ లాభంతో మొదలైంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 36000ల పైన, నిఫ్టీ 18050ల పైన ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇంధన, మెటల్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ  సహకారంతో మిడ్‌సెషన్‌ వరకూ సూచీలు పాజిటివ్‌గా ట్రేడయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 180 పాయింట్లు లాభపడి 36,086 వద్ద ఇంట్రాడే, నిఫ్టీ 60 పాయింట్లను లాభపడి 10,866 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది.
మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలు:- 
దేశ సరిహద్దుల్లో పరిస్థితులు మరింత తీవ్ర రూపదాల్చడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనయ్యారు. ఫలితంగా మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగడంతో సూచీలు  ఆరంభలాభాలను కోల్పోయాయి. ముఖ్యంగా ఐటీ, అటో షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరగడంతో సూచీలు గరిష్ట స్థాయిల నుంచి పతనమయ్యాయి. సెన్సెక్స్‌ గరిష్టస్థాయి నుంచి (36,085) 257 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ సూచీ సైతం తన గరిష్ట స్థాయి(10,866) నుంచి 81 పాయింట్లను నష్టపోయింది. అయితే చివరి గంటలో మెటల్‌, ప్రభుత్వరంగ షేర్ల అండతో సూచీలు తమ నష్టాలను పరిమితం చేసుకోగలిగాయి. చివరకు నిఫ్టీ 10800ల దిగువున 10,792 వద్ద, సెన్సెక్స్‌ 35,867 వద్ద స్థిరపడ్డాయి.
హీరోమోటోకార్ప్‌, మారుతి, అల్ట్రాటెక్‌సిమెంట్‌, ఐషర్‌మోటర్స్‌, టీసీఎస్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, గెయిల్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, వేదాంత, ఓఎన్‌జీసీ షేర్లు 2శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి.You may be interested

మళ్లీ మోది వస్తే 7 శాతం అప్‌..రాహుల్‌ అయితే 2 శాతం

Thursday 28th February 2019

ఎన్నికల ఫలితాల అనంతరం సెన్సెక్స్‌పై అంచనాలు మే నెలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, నరేంద్ర మోది ప్రభుత్వం తిరిగి అధికారం చేపడితే ఈక్విటీలకు అత్యంత అనుకూలంగా వుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఆగస్టు 29 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,989 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని తాకిన తర్వాత ఇప్పటివరకూ 8 శాతం నష్టపోయింది. 2018లో కనిష్టస్థాయి నుంచి వేగంగా కోలుకుని, కొత్త గరిష్టస్థాయికి చేరిన తీరు

ఈ షేర్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌

Thursday 28th February 2019

ఇండోపాక్‌ ఉద్రిక్తతల కారణంగా నిఫ్టీ-50...200 డీఎంఏ, 50 డీఎంఏ స్థాయల్ని కోల్పోయినప్పటికీ, 50 వరకూ షేర్లు రానున్న రోజుల్లో పెరిగే సంకేతాల్ని అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, హీరోమోటో, ఇంద్రప్రస్థ గ్యాప్‌ తదితర షేర్లు సాంకేతికంగా బుల్లిష్‌ క్రాసోవర్‌ను కనపరుస్తున్నాయి. మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జెన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా చూస్తే ఆయా షేర్లు రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌ ప్రదర్శించే అవకాశాలున్నాయి. బుల్లిష్‌ క్రాసోవర్‌ కనపర్చిన షేర్లలో

Most from this category