News


యాపిల్‌ దెబ్బ- 12,000 దిగువకు నిఫ్టీ

Tuesday 18th February 2020
Markets_main1582022444.png-31902

41,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌
మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం డౌన్‌
మీడియా, ఐటీ రంగాలు ఎదురీత

పలు ప్రతికూల అంశాల నడుమ వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ 161 పాయింట్లు క్షీణిం‍చి 40,894 వద్ద నిలవగా.. నిఫ్టీ 53 పాయింట్లు తక్కువగా 11,993 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 12,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్‌ తగ్గించడం, కరోనా వైరస్‌ ఆందోళనలు, స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరచడం వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా జనవరి-మార్చి త్రైమాసికంలో ఉత్పత్తి, అమ్మకాలు క్షీణించనున్నట్లు యూఎస్‌ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ తాజాగా అంచనా వేయడంతో ప్రధానంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో తొలుత బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా మరింత నీరసించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 40,611కు క్షీణించగా.. నిఫ్టీ 11,908ను తాకింది. తదుపరి చివర్లో అమ్మకాలు తగ్గడంతో కొంతమేర కోలుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 41,042 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరగా.. నిఫ్టీ 12,031 వరకూ బలపడింది.

ఇన్‌ఫ్రాటెల్‌ పతనం
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ 1-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే మీడియా 2 శాతం, ఐటీ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌ 11 శాతంపైగా పతనంకాగా.. యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌, హిందాల్కో, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, యూపీఎల్‌, మారుతీ, హీరో మోటో 6.4-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే కోల్‌ ఇండియా, జీ, బీపీసీఎల్‌, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, సిప్లా, ఐషర్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ 3-1 శాతం మధ్య పెరిగాయి.

ఐడియా డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, ఎల్‌ఐసీ హౌసింగ్‌, కంకార్‌, బాలకృష్ణ 10-3 శాతం మధ్య తిరోగమించాయి. కాగా.. మరోపక్క మెక్‌డోవెల్‌, బీఈఎల్‌, అపోలో హాస్పిటల్స్‌, ఆయిల్‌ ఇండియా, అమరరాజా, టీవీఎస్‌ మోటార్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1611 నష్టపోగా.. 885 మాత్రమే లాభపడ్డాయి.

అమ్మకాల వైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 374 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 154 కోట్లు చొప్పున  పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 705 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు దాదాపు రూ. 220 కోట్లను ఇన్వెస్ట చేసిన విషయం విదితమే.You may be interested

వాల్యూంలు లేని షేర్ల నుంచి బయటపడండి!

Tuesday 18th February 2020

టెక్నికల్‌ అనలిస్టుల సూచన ఒక షేరు కొత్త గరిష్ఠాలను తాకుతున్నా వాల్యూంలు మాత్రం పెద్దగా లేకుంటే అలాంటి షేర్లలో ప్రాఫిట్‌ బుక్‌ చేసి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యమైన షేర్లు మంచి స్పీడున్న కార్లలాంటివని, వాటి కౌంటర్లలో వాల్యూంలు కారును నడిపే ఇంధనం లాంటివని వివరించారు. ఎంతప్పటికీ కారులో ఫీచర్లు, డిజైన్‌ తదితరాలు చూసి మురిసిపోతే కారు నడవదని, ట్యాంకు నిండా ఇంధనం ఉంటేనే స్పీడందుకుంటుందని చెప్పారు. అలాగే షేర్లు సైతం

దేశంలోనే సంపన్న సీఈఓ..నవిల్‌ నోర్నా!

Tuesday 18th February 2020

 భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానలో ముఖేష్‌ అంబానీ ఉండగా రెండోస్థానంలో ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఉన్నారు. వీరంతా ఆయా కంపెనీల ప్రమోటర్లుగా వ్యవహరిస్తూ సంపన్నుల జాబితాలో నిలవగా.. వృత్తిపరమైన నైపుణ్యాలతో సీఈఓలుగా ఎదిగి ఆయా కపెనీలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారిలో దేశంలోనే అత్యంత సంపన్న సీఈఓగా నిలిచారు నవిల్‌ నోర్నా. వీల్‌ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ

Most from this category