నష్టాల ముగింపు
By Sakshi

ఒకరోజు విరామం తరువాత మార్కెట్లో మళ్లీ అమ్మకాల పర్వం కొనసాగింది. గత ట్రేడింగ్‌లో మిశ్రమంగా ముగిసిన సూచీలు బుధవారం భారీ నష్టాలను చవిచూసాయి. సెన్సెక్స్ 174 పాయింట్లు కోల్పోయి 38,557 వద్ద స్ధిరపడింది. నిఫ్టీ 57పాయింట్లను నష్టపోయి 11500 స్థాయి దిగువున 11,498.90 ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు, పెరిగిన ముడిచమురు ధరలతో పాటు దేశీయ మార్కెట్లో బడ్జెట్ ప్రతిపాదన భయాలు కొనసాగడం, డాలర్ మారకంలో రూపాయి బలహీనత తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అలాగే అమెరికాపై భారత్ విధిస్తున్న టారీఫ్‌లపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ మండిపడటం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ ప్రతికూలాంశాల నేపథ్యంలో ట్రేడింగ్ ఆద్యంతం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అటో, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. యస్ బ్యాంక్(2 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్(1శాతం), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(అరశాతం) ర్యాలీ చేయడంతో నిఫ్టీ ప్రైవేట్ రంగ సెక్టార్ ఎలాంటి లాభనష్టాలు లేకుండా ముగిసింది. ఇదే ఎన్ఎస్ఈలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ మాత్రం 47.05 పాయింట్ల నష్టంతో 30,522.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే సెన్సెక్స్ 381 పాయింట్ల రేంజ్లో కదలాడి 38,474.66 - 38,854.85 స్థాయిలో ట్రేడైంది. నిఫ్టీ ఇండెక్స్ 121 పాయింట్లు రేంజ్లో 11,475.65 - 11,593.70 శ్రేణిలో కదలాడింది. బీపీసీఎల్, టాటాస్టీల్, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 3శాతం నుంచి 5శాతం నష్టపోగా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, కోల్ ఇండియా, యస్ బ్యాంక్ షేర్లు అరశాతం నుంచి 2శాతం లాభపడ్డాయి.
You may be interested
రెండేళ్ల కనిష్ఠానికి క్యు1 రెవెన్యూవృద్ధి!
Wednesday 10th July 2019క్రిసిల్ అంచనా కార్పొరేట్ ఇండియా రెవెన్యూపై వినిమయంలో మందగమనం తీవ్ర నెగిటివ్ ప్రభావం చూపనుందని రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ ప్రభావంతో క్యు1లో రెవెన్యూ వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పడిపోతుందని అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రెవెన్యూలో 5-6 శాతం వృద్ధి ఉంటుందని, ఇది గత రెండేళ్లలో కనిష్ఠ స్థాయని తెలిపింది. గత నాలుగు త్రైమాసికాల్లో కంపెనీల సరాసరి రెవెన్యూ వృద్ధి 14- 15 శాతం ఉంది.
ఆదాయాలపై కోటక్ ఈక్విటీస్ ప్రివ్యూ
Wednesday 10th July 2019ఇయర్ ఆన్ ఇయర్(వై ఓ వై) ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 త్రైమాసికంలో కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్(కేఐఈ) నికర ఆదాయం 1.3 శాతంపెరగనుందని కేఐఈ అంచనా వేసింది. ఈ పెరుగుదలలో బ్యాంకింగ్ సెక్టార్ పాత్ర కీలకంగా ఉండనుందని తెలిపింది. ‘‘తక్కువ బేస్ కారణంగా బ్యాంకింగ్ సెక్టార్ అధిక ఆదాయవృద్ధిని ప్రకటించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టార్‌ను పక్కన పెడితే నికర ఆదాయంలో 6.7 శాతం(వై ఓ వై ఆదారంగా)