News


నిఫ్టీ రికార్డు ముగింపు...సెన్సెక్స్‌ 370 పాయింట్లు జంప్‌

Tuesday 16th April 2019
Markets_main1555409501.png-25167

ముంబై:- దేశీయ మార్కెట్‌ మంగళవారం రికార్డు ర్యాలీ చేసింది. కంపెనీలు లాభదాయక ఫలితాలతో ఎర్నింగ్‌ సీజన్‌ ప్రారంభించడటం, ఈ ఏడాదిలో వర్షపాతం సాదారణ స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఇటీవల దేశీయంగా వెలువడిన వాణిజ్యలోటు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో పాటు సాంకేతిక అంశాలు మద్దతుతో ఇంట్రాడేలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, అటో, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లలో కొనుగోళ్లు అధికంగా జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 541 పాయింట్లు లాభపడి 39,364.34 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల పెరిగి 11,810.95 వద్ద తమ జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. అయితే రేపు మహవీర్‌ జయంతి సందర్భంగా మార్కెట్‌కు సెలవు కావడంతో ట్రేడింగ్‌ చివర్లో కొంత అమ్మకాలు జరిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 369.80 పాయింట్ల లాభంతో 39,275.64 వద్ద, నిఫ్టీ 96.80 పాయింట్ల పెరిగి 11,787.15 వద్ద ముగిసింది. ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 1.42శాతం(427.10     పాయింట్లు) లాభపడి 30,531.35 వద్ద ముగిసింది. 
గ్రాసీం, ఓఎన్‌జీసీ, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ షేర్లు 2.18శాతం నుంచి 4శాతం లాభపడగా, ఇన్ఫోసిస్‌, టాటామోటర్స్‌, గెయిల్‌, సిప్లా, విప్రో షేర్లు అరశాతం నుంచి 2శాతం  నష్టపోయాయి.



You may be interested

ట్రెండ్‌ మారింది....నిఫ్టీ ఏడాది టార్గెట్‌ 13,000

Tuesday 16th April 2019

ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నిఫ్టీ స్థాయిని పరిశీలిస్తే మార్కెట్‌ దిశ మారినట్లు పరిగణిస్తున్నామని, ప్రస్తుత 2019-2020 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ టార్గెట్‌ను 13,000 పాయింట్లకు పెంచుతున్నట్లు ప్రముఖ సెక్యూరిటీస్‌ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. నిఫ్టీ ‘గోల్డెన్‌క్రాస్‌’ను నమోదుచేసినందున, మార్కెట్‌ దిశ అప్‌సైడ్‌కు మారినట్లు తెలిపింది. మీడియం టెర్మ్‌ మూవింగ్‌ ఏవరేజ్‌ (50 రోజుల సగటు)...లాంగ్‌టెర్మ్‌ మూవింగ్‌ ఏవరేజ్‌ను (200 రోజుల సగటు) క్రాస్‌ చేయడానికి

జీవితకాల గరిష్టానికి చేరువలో ఐసీఐసీఐ బ్యాంక్‌

Tuesday 16th April 2019

ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టస్థాయికి చేరువులో ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.397.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్ సాచెస్ రానున్న రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కార్పోరేట్ వ్యాపార రంగంలో ఆదాయాలను ఆర్జించడంలో తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఆస్తులపై ఆదాయాలు 1.8శాతం, ఈక్విటీలపై

Most from this category