నష్టాల ముగింపు
By Sakshi

మార్కెట్ లాభం ఒక్కరోజుకే పరిమితమైంది. సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 167.17 పాయింట్లు నష్టపోయి 39000 దిగువున 38,822.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్ 59 పాయింట్లు కోల్పోయి 11500 స్థాయి కింద 11,512.40 వద్ద ముగిసింది. అన్నిరంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా మెటల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల పతనంతో ఎన్ఎస్ఈలో కీలమైన బ్యాంక్ ఇండెక్స్ అరశాతం నష్టపోయి 38,000 దిగువున 29,876.65 వద్ద స్థిరపడింది. నేడు అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభపు రోజు కావడంతో సూచీలు మిశ్రమంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 39,003 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 11,556 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్వల్పంగా లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 11,593.60 వద్ద, సెన్సెక్స్ పాయింట్లు పెరిగి 39,107.37 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అనంతరం... నేడు వారంతపు రోజుకావడంతో ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గచూపడంతో సూచీలు లాభాలు క్రమంగా కరిగిపోయాయి. మిడ్‌సెషన్ అనంతరం కూడా అమ్మకాలు తగ్గకపోవడంతో సూచీలు నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 201 పాయింట్లు నష్టపోయి 38,782.60 వద్ద, నిఫ్టీ 72పాయింట్లను నష్టపోయి 115000 దిగువున 11,499.75 స్థాయిని తాకింది. క్రితం వారాంతంలో కేంద్రం ప్రకటించిన టాక్స్ కట్‌తో ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 717 పాయింట్లు, నిఫ్టీ 268 వద్ద పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన 4వారాల్లో ఈ వారంలోనే సూచీలు అత్యధికంగా లాభాలను ఆర్జించాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 3శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గానూ, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3శాతం లాభంతో ముగిశాయి. జీ లిమిటెడ్, టాటాస్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్, వేదాంత లిమిటెడ్ షేర్లు 4.50శాతం నుంచి 5.50శాతం వరకు నష్టపోయాయి. కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వీసెస్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 1శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.
You may be interested
బ్రోకరేజిల టాప్ సిఫార్సులు!
Friday 27th September 2019వివిధ అంతర్జాతీయ బ్రోకరేజిలు 6 లార్జ్‌క్యాప్ షేర్లను దీర్ఘకాలానికి కొనొచ్చని సిఫార్సుచేస్తున్నాయి. అవి... బ్రోకరేజి: క్రెడిట్ సూసీ భారతీ ఇన్ఫ్రాటెల్ స్టాక్‌పై ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను క్రెడిట్ సూసీ ఇచ్చింది. ఈ స్టాకు టార్గెట్ ధరను రూ. 330 గా నిర్ణయించింది. తాజా దిద్దుబాటు తర్వాత ఈ స్టాక్ వాల్యుషన్ ఆకర్షణీయంగా ఉందని, టెలికాం సెక్టార్లో ఈ స్టాక్‌ను పరిశీలించవచ్చని సలహాయిచ్చింది. అంతేకాకుండా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వలన ఈ స్టాక్ ఈపీఎస్(షేరుపై లాభం) అంచనాలను 28శాతం
ఫార్మా షేర్ల పతనం
Friday 27th September 2019ఫార్మా షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో పతనాన్ని చవిచూశాయి. ఎన్ఎస్ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2శాతం నష్టపోయింది. నేడు ఫార్మా ఇండెక్స్ 7,837.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్ ఒక దశలో 2శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్ క్రితం ముగింపు(7857.30)తో పోలిస్తే 2శాతం నష్టపోయి 7,700.10 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండెక్స్‌లో పిరమిల్