News


సూచీలకు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షాక్‌

Monday 22nd July 2019
Markets_main1563792477.png-27236

3వరోజూ ఆగని పతనం
11350 దిగువకు నిఫ్టీ
300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 
హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ద్వయం భారీ పతనంతో మార్కెట్‌ మూడో రోజూ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 306 పాయింట్లు నష్టంతో 38,031 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లను కోల్పోయి 11, 346.20 వద్ద స్థిరపడ్డాయి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన  పరిస్థితులు, దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అలాగే  క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత, దేశవ్యాప్తంగా వర్షపాతం తక్కువ శాతంగా నమోదు కావడం, ఇప్పటి వరకు క్యూ1 ఫలితాలను వెల్లడించిన కార్పోరేట్‌ కంపెనీలు పలితాలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలను నిరాశపరచడటం తదితర అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,890.32-38,333.52 స్థాయిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 11,301.25 - 11,398.15 శ్రేణిలో రేంజ్‌లో ట్రేడైంది. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్‌, ఫార్మా, మీడియా, ఐటీ, అటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్య, చిన్న తరహా షేర్లలో విరివిగా అమ్మకాలు జరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1శాతం నష్టపోగా, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇం‍డెక్స్‌ 1.50శాతం క్షీణించింది.  ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 495 పాయింట్లు(1.66శాతం) నష్టపోయి 29,275.35 వద్ద క్షీణించాయి.
సూచీలకు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షాక్‌:- ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్ల క్షీణత సూచీల భారీ పతనానికి కారణమైంది. హెచ్‌డీఎఫ్‌సీ 5శాతం, హెచ్‌డీఎఫ్‌ బ్యాంకు 3శాతం క్షీణించాయి. నేడు నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో కోల్పోయిన మొత్తం 141 పాయింట్ల ఈ రెండు షేర్ల వాటా 87 పాయింట్లు కావడం విశేషం. అలాగే ఈ రెండు షేర్లు నేడు రూ.44వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయాయి. 
హెచ్‌డీఎఫ్‌సీ , ఐషర్‌మోటర్స్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ షేర్లు 3శాతం నుంచి 5.50శాతం నష్టపోగా,  జీ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, హిందాల్కో, వేదాంత, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 9.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

బంధన్‌ బ్యాంకుపై బ్రోకరేజీల భిన్న స్పందన

Monday 22nd July 2019

బంధన్‌ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి మంచి ఫలితాలను ప్రకటించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. అయితే ఈ స్టాక్‌ విషయంలో బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.   బ్రోకరేజీ సంస్థ యాంబిట్‌ ఈ స్టాక్‌కు రూ.309 టార్గెట్‌తో తన సెల్‌ రేటింగ్‌ను కొనసాగించింది. ప్రస్తుత ధర రూ.501 నుంచి చూసుకుంటే 40 శాతం తక్కువకు టార్గెట్‌

ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Monday 22nd July 2019

క్యు1 ఫలితాల అనంతరం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థలు పాజిటివ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాయి. క్యు1లో కంపెనీ లాభంలో సుమారు 7 శాతం వృద్ధి నమోదయింది. ఈ నేపథ్యంలో బ్రోకింగ్‌ సంస్థలు ఆర్‌ఐఎల్‌పై బుల్లిష్‌గా మారాయి. - బోఫాఎంఎల్‌: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ ధర రూ. 1560కి పెంపుదల. అన్ని విభాగాల్లో అంచనాలకు మించిన ప్రదర్శన చూపింది. ఈపీఎస్‌ అంచనాలను 2-3 శాతం మేర పెంచింది. మందకొడి సమయంలో

Most from this category