News


ఐదో రోజూ ఆగని అమ్మకాలు

Wednesday 24th July 2019
Markets_main1563963447.png-27287

  • 11300దిగువున ముగిసిన నిఫ్టీ 
  • 135 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్‌

మార్కెట్‌లో అమ్మకాలు ఆగడం లేదు. ఫలితంగా సూచీలకు ఐదోరోజూ నష్టాల ముగింపు తప్పలేదు. మెటల్‌, అటో, ఫార్మా, ఇంధన, బ్యాకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా జరగడంతో బుధవారం సెన్సెక్స్‌ 135 పాయింట్లను నష్టపోయి 37,847.65 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లను కోల్పోయి 11300ల దిగువున 11,271 వద్ద స్థిరపడింది. బ్యాంకు షేర్ల పతనంతో ఎన్ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 175(0.60శాతం) పాయింట్ల నష్టంతో 28,952.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) దేశీయ జీడీపీ వృద్ధి రేటు అంచనాను తగ్గించడంటంతో పాటు ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, జూలై డెరివేటివ్‌ సిరీస్‌ గడువు రేపు(జూలై 25న) ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌, కంపెనీల క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం.. తదితర కారణాలు సూచీల పతనానికి కారణమయ్యాయి. మెటల్‌, అటో షేర్ల ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవ్వగా, జీ లిమిటెడ్‌ 5శాతం లాభపడటంతో మీడియా షేర్లకు, హెచ్‌యూఎల్‌ 2శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఎఫ్‌ఎంసీజీ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో దశలో నిఫ్టీ 101 పాయింట్లు నష్టపోయి 11,230 వద్ద, సెన్సెక్స్‌ 275 పాయింట్లు కోల్పోయి 37,708.41 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. అయితే చివరి గంటలో మార్కెట్లో కొనుగోళ్లు జరగడటంతో సూచీలు కొంత మేరకు నష్టాలను పూడ్చుకోగలిగాయి.
ఇండస్‌ఇండ్‌, ఐషర్‌మోటర్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌ షేర్లు 3.50శాతం నుంచి 5.50శాతం వరకు నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఏషియన్‌ పేయింట్స్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. You may be interested

మోతీలాల్‌ఓస్వాల్‌ నుంచి టాప్‌ కాంట్రాబెట్స్‌

Wednesday 24th July 2019

 ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాబయింగ్‌, కాంట్రా సెల్లింగ్‌ మాత్రమే మంచి ఫలితాలిస్తాయని మోతీలాల్‌ఓస్వాల్‌ అభిప్రాయపడింది.(కాంట్రా ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే బాగా క్షీణించిన స్టాకులను ఎంచుకొని పెట్టుబడి పెట్టడం).  - తమ ఏడాది గరిష్ఠాల నుంచి  దాదాపు 20 శాతం వరకు పతనమైన కొన్ని స్టాకులను కొనొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ రికమండ్‌ చేస్తోంది. ఇందులో బీఓబీ, సీమెన్స్‌, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎండీసీ, ఐటీసీ ఉన్నాయి.  - మరోవైపు తమ ఏడాది కనిష్ఠాల నుంచి దాదాపు 60 శాతం లాభపడిన

తుదిదశలో ఒప్పందం..5 శాతం పెరిగిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Wednesday 24th July 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని కొంత వాటాను విక్రయించడానికి ఒక ఒప్పందం తుది దశకు చేరుకుందని జీ మేనేజింగ్‌ డైరక్టర్‌ పునిత్‌ గోయెంక ‍ప్రకటించడంతో బుధవారం(జులై 24)  జీ షేరు విలువ 4.28 శాతం లాభపడి రూ.376.25 వద్ద ముగిసింది.  మరొక ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నాం. వివరాలను కొద్ది రోజులలో ప్రకటిస్తాం’ అని పునిత్‌ గోయెంక అన్నారు. జీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన వారిలో 90 శాతం మంది చెల్లింపులు పూర్తి చేయడానికి కంపెనీకి సెప్టెంబర్ వరకు

Most from this category