News


11,200 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 29th July 2019
Markets_main1564397723.png-27387

మార్కెట్‌ అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. ఫలితంగా సూచీలు సోమవారం భారీ నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అటో, మెటల్, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువత్తడంతో సెన్సెక్స్‌ 196 పాయింట్లు నష్టపోయి 37,686.37 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లను నష్టపోయి 11200ల దిగువున 11189.20 వద్ద స్థిరపడ్డాయి.  బ్యాంకు షేర్ల పతనంతో ఎన్ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 29,295.90 వద్ద స్థిరపడింది. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా అటో షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,519.16-38,043.22 శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 11,152.40- 11,310.95 రేంజ్‌లో కదలాడింది. 

మార్కెట్‌ పతననానికి ఐదు కారణాలు:- 
అంతంత మాత్రంగా కంపెనీల ఆర్ధిక ఫలితాలు:- ఇప్పటి వరకు ప్రకటించిన పలు కార్పోరేట్‌ కంపెనీల ఫలితాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ముఖ్యంగా అటో, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన  ఫలితాలు మార్కెట్‌ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచాయి. అలాగే ఈ వారంలో ఎస్‌బీఐ, ఐటీసీ యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా లాంటి కీలకమైన కంపెనీలతో పాటు దాదాపు 400 కంపెనీల క్యూ1 ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహించారు. 

తగ్గని ఎఫ్‌ఐపీ అమ్మకాల తీవత్ర:- సంపన్న వర్గాలపై పన్ను విధింపు ప్రభావం ఈక్విటీ మార్కెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను ఆపడం లేదు. ఎఫ్‌పీఐలు ఈ జూలైలో మొత్తం రూ.14,382 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నటు గణాంకాలు చెబుతున్నాయి. అధిక సంపన్న వర్గాలపై పన్ను విధింపు అనే ప్రతిపాదన విదేశీ ఇన్వెస్టర్లను బాధపెట్టే ఉద్దేశ్యం కాదని, వారిని ట్రస్ట్రీల నుంచి నిర్మాణత్మక కంపెనీలుగా మారాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక ఇంటర్యూలో తెలిపారు.

అటోరంగ షేర్ల పతన ప్రభావం:- శనివారం జరిగిన 36వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త కార్లపై రిజిస్ట్రేషన్‌ ధరలను రూ.5000లుగా, అదే 15ఏళ్లపై పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ మార్చాలంటే అదనంగా రూ.10వేల వరకు పెంచుతున్నట్లు కౌన్సిల్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ధరలు రూ.600లు మాత్రంగానే ఉన్నాయి. అలాగే కొత్త ద్విచక్ర వాహన రిజిస్టే‍్రషన్‌ ధరను రూ.1000లుగా, పునరుద్ధరణ రిజిస్ట్రేషన్‌ ధరను రూ.2000లకు పెంచింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అటోరంగ షేర్ల తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. 

వాణిజ్య చర్చల సఫలంపై సందగ్ధత:- గతనెలలో జపాన్‌ జరిగిన జీ-20 సదస్సులో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ వారంలో అమెరికా- చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికిగాను షాంఘైలో రెండు దేశాల ప్రతినిధులు సమావేశంకానున్నారు. మంగళవారం నుంచి ప్రారంభంకానున్న ఈ సమావేశాలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ కీలక చర్చల నేపథ్యంలో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై చేసిన వివాదస్పద వాఖ్యలు వాణిజ్య చర్చల సఫలంపై ఇన్వెస్టర్లలో ఆందోళనను రెకెత్తించాయి. ఫలితంగా నేడు ఆసియాలో ప్రధాన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం పతనం:- మార్కెట్‌ అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్ల పతనం సూచీల భారీ క్షీణతకు కారణమయ్యాయి. నేడు ఈ రెండు షేర్లు దాదాపు 2శాతం క్షీణించాయి.


ఇన్ఫ్రాటెల్‌, వేదాంత, టాటామోటర్స్‌, గ్రాసీం, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 5శాతం నుంచి 12శాతం మేర నష్టపోగా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 3శాతం వరకూ  లాభపడ్డాయి. You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ ఫలితాలు: 45 శాతం పెరిగిన లాభం

Monday 29th July 2019

డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్ సోమవారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాలలో ఏకీకృత లాభం (పన్నుల తర్వాత లాభం) 45 శాతం పెరిగి ఏడాది నుంచి ఏడాది ప్రాతిపదికన రూ.662.80 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .456.10 కోట్ల ఏకీకృత లాభాన్ని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విశ్లేషకులు ఈ లాభం రూ.481 కోట్లుగా అంచనా వేయగా ఫలితాలు అంచనాలను మించి రావడం గమనర్హం. ఈ త్రైమాసికంలో

ఇండియాపైనే విదేశీ ఇన్వెస్టర్ల చిన్నచూపు

Monday 29th July 2019

జూలై నెలలో ఇప్పటివరకు దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి 200 కోట్ల డాలర్ల పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఇది ఈ నెలలో ఇతర వర్థమాన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడుల కంటే అధికం కావడం గమనర్హం. సూపర్‌ రిచ్ ట్యాక్స్‌ విధించడంతో పాటు దేశియంగా ఆర్థిక మందగమనం కొనసాగుతుండడంతో స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐలు వెళ్లిపోతున్నాయని పరిశీలకులు తెలిపారు. ఈ నెలలో సెన్సెక్స్‌, నిఫ్టీ 4 శాతం మేర నష్టపోయాయి.   థాయిలాండ్, ఇండోనేషియా, దక్షిణ

Most from this category