News


ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 16th January 2019
Markets_main1547633362.png-23618

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితుల నేపథ్యంలో బుధవారం భారత మార్కెట్‌ ఫ్లాట్‌గా ముగిసింది. యూరోప్‌లో బ్రెగ్జిట్‌ ఆందోళనతో పాటు ఆసియా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ఐరోపా మార్కెట్ల మిశ్రమ ప్రారంభం దేశీయ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు అక్కడక్కడే ముగిశాయి.  నిఫ్టీ 3.50 పాయింట్లు లాభపడి 10890.30 వద్ద, సెన్సెక్స్‌ 2.96 పాయింట్ల లాభపడి 36321.29 ముగిసింది. హెచ్‌డీఎఫ్‌ఎఫ్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్ల పతనం సూచీల ఆరంభ లాభాల్ని హరించివేయగా, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలిచాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 50 పాయింట్లు లాభపడి 27450 ముగిసింది. బ్యాంకింగ్‌, ఐటీ, ఫార్మా ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, అటో, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, రియల్టీ రంగ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 36,278.61 -  36,462.03 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ సూచీ 10,876.90 - 10,928.15 స్థాయిలో ట్రేడైంది.
ఏషియన్‌ పేయింట్స్‌, యూపీఎల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, భారతీఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, 1.50 శాతం నుంచి 2శాతం నష్టపోగా, బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.



You may be interested

నిధుల ప్రవాహం సన్నగిల్లడమే అసలు సమస్య!

Wednesday 16th January 2019

మార్కెట్‌పై మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అభిప్రాయం దేశీయ మార్కెట్లలోకి వస్తున్న దేశీయ, విదేశీయ నిధుల ప్రవాహం సన్నగిల్లుతోందని, మార్కెట్‌ పరుగులకు ఇదే అడ్డంకిగా మారవచ్చని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతినిధి కౌస్తుభ్‌ చెప్పారు. మార్కెట్లోకి సిప్‌ ద్వారా వచ్చే మొత్తం మాత్రం పెరుగుతోందని, కానీ ఇందులో పెరుగుదల రేటు సన్నగిల్లిందని తెలిపారు. మార్కెట్లోకి సరాసరిన 8-9 వేల కోట్ల రూపాయల నిధులు వచ్చే స్థితి నుంచి రూ.6వేల కోట్లకు పడిపోయాయన్నారు. అందువల్ల మార్కెట్‌ ఊపు

యూబీఎస్‌ ఎలక‌్షన్‌ పిక్స్‌

Wednesday 16th January 2019

దేశీయ ఈక్విటీలు ఈ సంవత్సరం 7 శాతం వరకు పతనం చవిచూడవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ అంచనా వేసింది. సాధారణ ఎన్నికల వేళ ఏర్పడే రాజకీయ అనిశ్చితి మార్కెట్‌ను కుంగదీస్తుందని తెలిపింది. నిఫ్టీ ఏడాది చివరకు పదివేల పాయింట్లను చేరవచ్చని అభిప్రాయపడింది. జీడీపీలో మాత్రం వృద్ధి ఉంటుందని 2019 అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఎన్నికల వేళ పాపులర్‌ విధానాలు, వాటి ఫలితాలు, వివిధ ప్రభుత్వాలు వాటి ఆధారిత సంస్కరణలు వంటి

Most from this category