STOCKS

News


10900 దిగువున ముగిసిన నిఫ్టీ

Wednesday 7th August 2019
Markets_main1565174526.png-27614

  • మార్కెట్‌ పతనాన్ని అడ్డుకోలేకపోయిన కోత తగ్గింపు 
  • 286 పాయింట్లు క్షీణించిన సెన్సె‍క్స్‌

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లపై కోత విధించినప్పటికీ.., మార్కెట్‌ రెండోరోజూ నష్టంతోనే ముగిసింది. సెన్సెక్స్‌  286 పాయింట్ల నష్టంతో 36,690.50 వద్ద, నిఫ్టీ 92.75 పాయింట్లను కోల్పోయి 10,855.50 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీంగా నెలకొన్న బలహీన సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి భారీ క్షీణిత, ఆర్‌బీఐ 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించడం తదితర అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., నేడు దేశీయ మార్కెట్‌ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో వడ్డీరేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో ఉదయం సెషన్స్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో సెన్సెక్స్‌ 127 పాయింట్లు పెరిగి 37,104.79 వద్ద, నిఫ్టీ 27  పాయింట్లు లాభపడి 10,975.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఆ దశలో ఆర్‌బీఐ రేట్ల కోత ప్రకటన సూచీల ర్యాలీకి బ్రేక్‌ వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్వహించిన  ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి కూడా రెపో రేటును తగ్గించింది. ఈ సారి 35 బేసిస్‌ పాయింట్ల మేరకు కోత విధించింది. స్వల్పకాల రుణ వడ్డీరేటు దీంతో 5.40శాతానికి చేరింది. దీంతో రివర్స్‌ రెపో రేటు 5.15 వద్దకు చేరింది. అలాగే 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించింది. రేట్ల తగ్గింపుతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి సైతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత విధించిన నేపథ్యంలో మార్కెట్లో అనూహ్యంగా అమ్మకాలు మొదలయ్యాయి. సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలు హరించుకుపోవడమే కాకుండా నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ గరిష్టస్థాయి(37,104.79) నుంచి 394  పాయింట్లు నష్టపోయి 37,104.79 వద్ద, నిఫ్టీ 139 పాయింట్లను కోల్పోయి 10,835.90 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. ఐటీ, ఫార్మా, మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనమయ్యాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు నష్టపోగా అదే బాటలో మెటల్‌, అటో, ఆర్థిక, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, రియల్టీ షేర్లు క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 1.14శాతం నష్టపోయి 28000 స్థాయి దిగువన 27,702.05 వద్ద స్థిరపడింది. 

బీపీసీఎల్‌, టాటామోటర్స్‌, టాటాస్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 4.50శాతం నుంచి 13.50శాతం వరకు నష్టపోయాయి. హీరోమోటోకార్ప్‌, హిందూస్థాన్‌ యూనిలివర్స్‌, యస్‌బ్యాంక్‌, సిప్లా, జీ లిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. 

 You may be interested

రేట్ల కోతపై విశ్లేషకుల మాట...

Wednesday 7th August 2019

ఆర్‌బీఐ ఎంపీసీ తాజా నిర్ణయాలపై విశ్లేషకులు, నిపుణులు దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. కాకపోతే ఆర్‌బీఐ రేట్ల తగ్గింపును బ్యాంకులు రుణ గ్రహీతలకు బదలాయించినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేశారు.    50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింపును మేం ఆశించాం. అయితే అసాధారణంగా 35 బేసిస్‌ పాయింట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది మార్కెట్లకు కొద్ది మేర సానుకూలం. అయితే ఆర్‌బీఐ జీడీపీ వృద్ధి అంచనాలను

ఆర్‌బీఐకి ఆందోళన లేదు: అబీక్‌ బారువా

Wednesday 7th August 2019

‘ఆర్థిక వ్యవస్థ మందగమనంలో చిక్కుకుందని, దీనిపై భయాందోళనలతో ఉన్నామనే విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పకనే చెప్పారు. కానీ ఈ మందగమనం లోతుగా లేదనే విషయం, ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల రేట్‌ కట్‌ చేయడంతో అర్థమవుతుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ ముఖ్య ఆర్థికవేత్త అభీక్‌ బారువా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..    ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్ అంతర్జాతీయ ఫోరంలో ప్రసంగించిన తర్వాత

Most from this category