News


సెన్సెక్స్‌ 587 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు క్రాష్‌

Thursday 22nd August 2019
Markets_main1566469678.png-27953

సెన్సెక్స్‌ నష్టం  587 పాయింట్ల
10750 దిగువకు ముగిసిన నిఫ్టీ 

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు దేశీయ మార్కెట్‌ను మరోసారి భారీగా దెబ్బతీసాయి. ఆర్థిక వృద్ధి మందగమనానికి ఉద్దీపన చర్యలేవి ఉండవని కేంద్రం నుంచి స్పష్టత రావడం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది కనిష్టానికి పతనం కావడం, క్యూ1లో దేశీయ నికర అమ్మకాల వృద్ధి క్షీణించడం, రేపు  జాక్సన్‌ హోల్‌ వేదికగా ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత, ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం, యూఎస్‌ ఫ్యూచర్ల​ఫ్లాట్‌ ట్రేడింగ్‌ కావడం తదితర ప్రతికూలాంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 587.44 పాయింట్ల పతనంతో 36,472.93 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 10,737.75 వద్ద ముగిశాయి. సూచీలకు ఇది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఇంట్రాడేలో రూపాయి బలహీనతతో ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ముఖ్యంగా మెటల్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల భారీ పతనంతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 2.38శాతం క్షీణించి 27,049.00 వద్ద స్థిరపడింది. 


అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో నేడు మార్కెట్‌ మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్‌ 18 పాయింట్ల లాభంతో 37,087.58 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 10,905.30 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే అటు అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. మిడ్‌సెషన్‌ వరకు ఓ మోస్తారుగా జరిగి అమ్మకాలు... ఆర్థిక మందగమాన్ని ఉత్తేజపరిచేందుకు కేంద్రం నుంచి ఎలాంటి ఉద్దీపన చర్చలు ఉండవని  చీఫ్‌ ఎకానమిక్‌ అడ్వైజర్‌ క్రిష్ణమూర్తి ప్రకటన అనంతరం అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. అలాగే యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది. దీంతో ఒక దశలో సెన్సెక్స్‌ 670 పాయింట్లు క్షీణించి 36,391.35 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయి 10,718.30 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అమ్మకాలు ఏదశలో తగ్గకపోవడంతో సూచీలు మూడోరోజూ భారీ నష్టాలను మూటగట్టుకుని ట్రేడింగ్‌ను ముగించాయి.

బజాజ్‌ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, వేదాంత, యస్‌ బ్యాంక్‌ షేర్ల 4.50శాతం నుంచి 12శాతం వరకు నష్టపోయాయి. హిందూస్థాన్‌ యూనిలివర్‌, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. You may be interested

భారీ పతనానికి ఐదు కారణాలు

Thursday 22nd August 2019

దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు వరుసగా మూడవరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. మెటల్‌, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల పతనంతోపాటు, ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందడంతో గురువారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 587.44 పాయింట్లు లేదా 1.59 శాతం తగ్గి 36,472.93 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 180.95 పాయింట్లు లేదా 1.67 శాతం తగ్గి 10,737.75 వద్ద ముగిశాయి. కాగా మార్కెట్‌ పతనానికి కారణమైన ఐదు అంశాలు... ఉద్దీపనంపై

యస్‌బ్యాంక్‌.. రూ.47వరకు పడే ఛాన్స్‌?!

Thursday 22nd August 2019

టెక్నికల్‌ అనలిస్టుల అంచనా గురువారం ట్రేడింగ్‌లో యస్‌బ్యాంక్‌ షేరు దాదాపు 8 శాతం పతనమయ్యాయి. దీంతో షేరు 2014 మార్చి తర్వాత కనిష్ఠాలకు వచ్చింది. ఇప్పటి పతనం అనంతరం షేరు కోలుకుంటుందని కొనుగోలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు కొంత కాలం ఆగడం మంచిదని టెక్నికల్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. షేరులో పతనం మరో లెగ్‌ ఆరంభమైందని, అందువల్ల షేరు మరో 20- 23 శాతం క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. టెక్నికల్‌ చార్టులు పరిశీలిస్తే

Most from this category