News


రెండోరోజూ కొనసాగిన నష్టాలు

Thursday 29th August 2019
Markets_main1567073985.png-28096

  • 383 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌
  • 10950 దిగువన ముగిసిన నిఫ్టీ 

ఆర్థిక మందగమన, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్‌ పతనం రెండోరోజూ కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 383 పాయింట్ల నష్టంతో 37,068.93 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లను కోల్పోయి 10,948 వద్ద స్థిరపడింది. నేడు ఆగస్ట్‌ ఎఫ్‌ఎండ్‌ఓ కాంటాక్టు గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను సెప్టెంబర్‌ సిరీస్‌కు రోలోవర్‌ మార్చుకోనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులను లోనయ్యాయి. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం తదితర అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మూడీస్‌, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ లాంటి సంస్థలు ఈ క్యూ1లో జీడీపీ గణాంకాలు బలహీనంగా నమోదవుతాయని అంచనా వేయడంతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్‌పై నెటిగివ్‌ అవుట్‌లుక్‌ ప్రకటించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల సాగడంతో సూచీలు ఏదశలో కోలుకోలేకపోయాయి. మిడ్‌సెషన్‌ నుంచి విక్రయాల తీవ్రత పెరగడంతో సూచీలు నష్టాలు మరింత పెరిగాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 427 పాయింట్లను కోల్పోయి 36,987.35 వద్ద, నిప్టీ 124 పాయింట్లు నష్టపోయి 10,922.40 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌,  ఆర్థిక, మీడియా, అటో రంగ షేర్లు అ‍మ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎక్కువగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోయాయి. నేటి నిఫ్టీ-50 సూచీలోకి టాప్‌-5 లూజర్లలో అన్ని షేర్లు బ్యాంకింగ్‌ రంగానికి చెందినవి కావడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ ఇండెక్స్‌ 500 పాయింట్లు నష్టపోయి 27,332.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,922.40 - 11,021.10  రేంజ్‌లో, సెన్సెక్స్‌ 36,987.35 -   37,381.80 శ్రేణిలో కదలాడింది.  

యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు కోల్‌ ఇండియా, వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇన్ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా షేర్లు 2.50శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. 


 



You may be interested

10,981కు దిగువనే ఉంటే మరింత క్షీణత..

Thursday 29th August 2019

నిఫ్టీ కీలకమైన 200 డీఎంఏ 11,207కు దిగువనే కొనసాగుతండడం, ఆ లోపు నిరోధ స్థాయిలను కూడా అధిగమించలేకపోవడంతో తదుపరి సెషన్లలో కదలికలను గమనించాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 11,000 మార్క్‌పైన కొసాగలేకపోయిందని, 11,150 స్థాయి, 200 డీఎంఏను దాటనంత వరకు స్థిరమైన అప్‌సైడ్‌కు అవకాశం లేదని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు.    ‘‘నిఫ్టీ ఎగువవైపు 11,150, దిగువవైపు 10,780 మధ్య

ఈ లార్జ్‌క్యాప్స్‌ ఆకర్షణియం!

Thursday 29th August 2019

దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు జూన్  2019 లో నమోదుచేసిన రికార్డు స్థాయి గరిష్ఠాల నుంచి 6-8 శాతం పడిపోయాయి. అన్నిటికన్నా స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌కు చెందిన స్టాకులు భారీగా నష్టపోవడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం లార్జ్‌ క్యాప్‌లలో కూడా చాలా వరకు స్టాకులు డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఎస్‌ అండ్‌ పీ లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 27 స్టాకులు వరకు వాటి 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి 10-30 శాతం

Most from this category