News


రెండోరోజూ అదే జోరు

Wednesday 26th June 2019
Markets_main1561544796.png-26594

మార్కెట్‌ ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. సూచీలు బుధవారమూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో39,592 వద్ద. నిప్టీ 51.10 పాయింట్లు పెరిగి 11,847.55 వద్ద స్థిరపడ్డాయి. నైరుతి రుతుపవనాలు శరవేగంగా ఉత్తర, మధ్య భారతదేశమంతటా విస్తరించాయనే ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర సానుకూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో మెటల్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, ఆర్థిక, రియల్టీ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ ఇందుకు కారణమైంది. అలాగే ఎఫ్‌ఎంజీసీ షేర్లలో కూడా స్వల్పంగా అమ్మకాలు జరిగాయి. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 315 పాయింట్లు (1 శాతం) పెరిగి 31,162.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 355 పాయింట్ల స్థాయిలో 39,319.64 - 39,674.22 శ్రేణిలో ట్రేడవగా, నిఫ్టీ 114 పాయింట్ల రేంజ్‌లో 11,757.55 - 11,871.85 స్థాయిలో కదలాడింది. 
హిందాల్కో, సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంత లిమిటెడ్‌ షేర్లు 3శాతం నుంచి 5శాతం లాభపడగా, భారతీఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, బ్రిటానియా షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

సంజీవ్‌ భాసిన్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 26th June 2019

ప్రస్తుత మార్కెట్లో మదర్‌సన్‌ సుమి, అపోలోటైర్స్‌, ఎక్సైడ్‌ షేర్లను రికమండ్‌ చేస్తున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌భాసిన్‌ చెప్పారు. లార్జ్‌క్యాప్స్‌లో భెల్‌ బాగుందన్నారు. పోర్టుఫోలియోలో వీటికి 5- 7 శాతం వరకు వాటా ఇవ్వచ్చన్నారు. రంగాల వారీగా ఒఈఎం రంగం ఆటో రంగం కన్నా ముందు బాటమ్‌ అవుట్‌ అవుతోందన్నారు. అందువల్ల ఈ రంగానికి చెందిన పైన పేర్కొన్న మూడు స్టాకులు మంచి ప్రదర్శన చూపుతాయని అంచనా వేశారు. రాబోయే

పేలవ స్టాకుల్లో పెరిగిన రిటైలర్ల పెట్టుబడులు

Wednesday 26th June 2019

ఈ ఏడాది అత్యంత అధ్వాన్న ప్రదర్శన జరిపిన స్టాకుల్లో అనూహ్యంగా రిటైలర్ల హోల్డింగ్స్‌ పెరిగిపోతున్నాయి. కొందరు అనలిస్టులు సైతం వీటి విషయంలో తప్పుగా ఊహించారు. ఇలాంటి పతనమైతున్న స్టాకుల ధరలను వాల్యూషన్లతో పోల్చి తప్పులో కాలేశారు. వీరిని చూసి గుడ్డిగా పలువురు రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం ఇలాంటి స్టాకుల్లో చేతులు కాల్చుకున్నారు. రిటైలర్లకు ఇలాంటి కంపెనీల్లో నెలకొన్న నిజ సమస్యల స్వరూపం తెలియదని, కేవలం స్టాక్‌ ధరను చూసి గుడ్డిగా

Most from this category