News


స్టాక్‌ మార్కెట్‌కు సీతమ్మ భరోసా..!

Tuesday 24th March 2020
Markets_main1585046052.png-32654

  • అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటన
  • 692 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌
  • 190 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 

స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభంతో ముగిసింది. కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అతి తర్వలో కార్పోరేట్లకు ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. కొన్ని ఫైనాన్షియల్‌ వెసులుబాట్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆమె పేర్కోన్నారు.  దీనికి తోడు ఆర్థిక స్థిరీకరణకు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హామీతో ఆసియాతో పాటు యూరప్‌ మార్కెట్లు రికవరీ, భారీ పతనంతో తర్వాత దేశీయ మార్కెట్లో షార్ట్‌ కవరింగ్‌ తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 692.79 పాయింట్ల లాభంతో 26674.03 వద్ద, నిఫ్టీ 190.80 పాయింట్లు పెరిగి 7801.05 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 7,511.10-8,036.95 రేంజ్‌లో కదలాడగా, సెన్సెక్స్‌ 25,638.90 - 27,462.87 స్థాయిలో ట్రేడయ్యాయి. ఒక్క రియల్టీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అ‍త్యధికంగా ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.12శాతం పెరిగి 17,107.30 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 1శాతం లాభంతో ముగిశాయి. 

మారుతి సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 8శాతం నుంచి 14శాతం లాభపడ్డాయి. ఇన్ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, గ్రాసీం, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు 2.50శాతం నుంచి 8శాతం నష్టపోయాయి. 



You may be interested

షార్ట్‌ సెల్లింగ్‌ వల్లే ఇంత నష్టం: దేవేన్‌ ఆర్‌ చోక్సీ

Tuesday 24th March 2020

ప్రస్తుత సంక్షోభం కూడా సమసిపోయేదేనని ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ఎండీ దేవేన్‌ చోక్సీ అన్నారు. కాకపోతే, ప్రస్తుతం చూస్తున్నది అసాధారణ పరిస్థితి అని, ప్రపంచమంతా మూతపడుతుండడాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు. కనుక ఇటువంటి పరిస్థితి మొదటి సారిగా వచ్చిందన్నారు. అయితే, దీన్నుంచి బలంగా బయటకొస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాపార మూలాలు ఒక పరిమితికి మించి పెద్దగా నష్టపోవన్నారు. అయితే, మన మార్కెట్లు దాదాపు నష్టాన్ని

ఐఆర్‌సీటీసీ రివర్స్‌ పరుగు

Tuesday 24th March 2020

7వ సెషన్లోనూ డౌన్‌ సర్క్యూట్‌ 7 రోజుల్లో 30 శాతం పతనం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీయంగానూ రైల్వే సర్వీసులు బంద్‌కావడంతో పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌కు షాక్‌ తగులుతోంది. కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడితో పతన బాటలో సాగుతున్న ఈ కౌంటర్‌ మరోసారి కుదేలైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో రూ. 45 క్షీణించి

Most from this category