News


11000 పైన ముగిసిన నిఫ్టీ

Thursday 8th August 2019
Markets_main1565261023.png-27645

మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన కొనుగోళ్లతో గురువారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 636 పాయింట్లు లాభపడి 37,327.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 11,032.45 ముగిసింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు కాస్త మెరుగుపడటంతో పాటు కనిష్టస్థాయిల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరించింది. అలాగే బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంపన్న వర్గాలపై పన్ను విధింపును ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. నేడు అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 36,808 వద్ద నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 10,899 వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించాయి. అయితే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గచూపడంతో  సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలయ్యాయి. ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లులో అమ్మకాలు నెలకొనడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 45 పాయింట్లు నష్టపోయి 36,655.41 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 10,842.95 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌ సెషన్‌ నుంచి మార్కెట్లో అనూహ్యంగా కొనుగోళ్లు జరపడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. ఆసియా మార్కెట్లు లాభాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. ముఖ్యంగా అటో, ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ఒకదశలో సెన్సెక్స్‌ కనిష్టస్థాయి నుంచి 750 పాయింట్లు మేర ర్యాలీ చేసి 37,405.48 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పెరిగి 11,058.05 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ ర్యాలీ బ్యాంకు నిఫ్టీ సైతం ఒకదశలో 28,227.55 స్థాయికి ఎగిసింది. చివరి అరగంటలో ట్రేడర్లు కొంత​అమ్మకాలు జరిపడటంతో సెన్సెక్స్‌ 636 పాయింట్లు, నిఫ్టీ 11000పైన ముగిసింది. 
బీపీసీఎల్‌, రిలయన్‌ ఇండస్ట్రీస్‌, టాటామోటర్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 4శాతం నుంచి 6.50శాతం లాభపడగా, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌సిమెంట్స్‌, సిప్లా, టాటామోటర్స్‌ షేర్లు 1శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. 



You may be interested

మిడ్‌క్యాప్‌లో రాబడులకు కోటక్‌ పోర్ట్‌ఫోలియో

Thursday 8th August 2019

ఆర్‌బీఐ తాజాగా 35 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోత నిర్ణయం తీసుకోవడం మార్కెట్లకు రుచించలేదు కానీ, ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ మినహాయింపు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందున్న వార్తలు గురువారం స్టాక్‌ సూచీలను పరుగులు తీయించాయి. అయితే, మార్కెట్లు ఇప్పటికప్పుడు తిరిగి గాడిన పడి ర్యాలీ చేస్తాయన్న అభిప్రాయం ఏ ఒక్క విశ్లేషకుని మాటల్లోనూ కనిపించడం లేదు. కాకపోతే దీర్ఘకాలం పాటు ఓపిక

‘సూపర్‌ రిచ్‌’ ట్యాక్స్‌ నుంచి ఎఫ్‌పీఐలకు మినహాయింపు?

Thursday 8th August 2019

ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అధిక సంపన్నులపై సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ను విధించడంతో దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ విదేశి నిధుల ఔట్‌ ఫ్లో ను తగ్గించడానికి చర్యలను చేపట్టనుంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌

Most from this category