STOCKS

News


11000 పైన ముగిసిన నిఫ్టీ

Wednesday 14th August 2019
Markets_main1565778065.png-27765

353 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 
కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సానుకూలాంశాలు

కిత్రం ట్రేడింగ్‌ భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్‌ బుధవారం కొంతవరకూ ఆ నష్టాల్ని పూడ్చుకోగలిగింది.  సెన్సెక్స్‌ 353 పాయింట్లు లాభంతో 37,311.53 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 11,029.40 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలకు తోడు షార్ట్‌ కవరింగ్‌, రూపాయి షార్ప్‌ రికవరీ తదితర అంశాలు సూచీలు లాభాలకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో నేడు మార్కెట్‌ లాభంతో మొదలైంది. ట్రేడింగ్‌ ఆద్యంతం అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతివ్వడంతో సూచీలు ఏదశంలో వెనుదిరగలేదు. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. ప్రైవేట్‌రంగ షేర్లు రాణించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.05శాతం లాభపడి 28000 స్థాయి పైన 28019 వద్ద ముగిసింది.  
అంతర్జాతీయ పరిణామాలు:-  సెప్టెంబర్‌ 1నుంచి  అమెరికా ప్రభుత్వం చైనా దిగుమతులపై 10శాతం అదనపు పన్ను విధింపు గడువును మరికొంతకాలం పొడిగించింది. అమెరికా హాలీడే అమ్మకాలపై ఎలాంటి ‍ప్రతికూల ప్రభావాన్ని చూపకూడదనే ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం కొంతకాలం మరుగున పడవచ్చనే అశలతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు దాదాపు 2శాతం లాభంతో ముగియండంతో పాటు నేడు ఆసియాలో సింగపూర్‌ తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 
దేశీయ పరిణామాలు:- బడ్జెట్‌లో ప్రతిపాదించిన సూపర్‌ రిచ్‌ సర్‌ఛార్జీ విధింపు నుంచి విదేశీ ఇన్వెస్టర్లను ఎలా మినహాయింపు ఇవ్వాలో అనే అంశంపై చర్చించేందుకు ఆర్థికశాఖ మంత్రిత్వ శాఖ త్వరలో న్యాయ మంత్రిత్వశాఖను సంప్రదింపులు జరుపుతుందనే వార్తలు వెలుగులోకి రావడంతో పాటు కేంద్ర గణాంకాల శాఖ నిన్న, నేడు వెలువరించిన ఆశాజన ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ ర్యాలీకి తోడ్పాటునిచ్చాయి. జూలైలో రీటైల్‌ ద్రవ్యోల్బణం 3.12శాతంగా నమోదుకాగా, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. ద్రవ్యోల్బణ గణాంకాలు అదుపులో ఉ‍ండటంతో ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అంచానాలు మార్కెట్లో నెలకొన్నాయి. 
కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌, రూపాయి  రికవరి:- ఇటీవల మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా అధిక వాల్యూ షేర్లు కనిష్టస్థాయిలకు వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆయా ఆయా షేర్ల కొనుగోళ్లకు మొగ్గచూపారు. అలాగే గత ట్రేడింగ్‌లో 62 పైసల భారీ నష్టంతో ఆరు నెలల కనిష్ట స్థాయికి పతనమైన రూపాయి నేడు షార్ప్‌ రికవరీని సాధించగలిగింది. అంతర్జాతీయంగా ముడిచమరు ధరలు దిగివరావడంతో పాటు దేశీయంగా ఆశాజనక ఆర్థిక గణాంకాలు వెలువడంతో రూపాయి రికవరికి తోడ్పాటునిచ్చాయి. 

వేదాంత, టాటాస్టీల్‌, జీ లిమిటెడ్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, యూపీఎల్‌ షేర్లు 4శాతం నుంచి 5శాతం వరకు లాభపడ్డాయి. అలాగే డాక్టర్‌ రెడ్డీస్‌, కోల్‌ ఇండియా, విప్రో, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా షేర్లు 2శాతం నుంచి 5శాతం వరకూ నష్టపోయాయి. 



You may be interested

పసిడిలో పెట్టుబడులు పెట్టవచ్చా?

Wednesday 14th August 2019

ర్యాలీ కొనసాగవచ్చని నిపుణుల అంచనా ఎంసీఎక్స్‌లో బంగారం పదిగ్రాముల ధర రూ. 37270ని తాకింది. దీంతో ఈ ఏడాది ఇంతవరకు పసిడి దాదాపు 18 శాతం ర్యాలీ జరిపినట్లయింది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కొనసాగుతున్న బుల్‌ ర్యాలీకి అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు 1500 డాలర్లకు అటుఇటుగా కదలాడుతోంది. పసిడిలో ఇంతటి ర్యాలీకి ప్రధాన కారణం ట్రేడ్‌వార్‌

ఇండియా మార్కెట్టే బెటర్‌!

Wednesday 14th August 2019

వర్ధమాన మార్కెట్ల కన్నా మంచి ప్రదర్శన ఈపీఎఫ్‌ఆర్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ కామెరాన్‌ బ్రాండ్‌ వాణిజ్యయుద్ధ వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ఈ ఏడాది ఇండియా సహా ఏ ఇతర వర్ధమాన మార్కెట్‌లోకి కూడా భారీ విదేశీ నిధులు రాకపోవచ్చని ఈపీఎఫ్‌ఆర్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ కామెరాన్‌ బ్రాండ్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఆసియాలోని ఇతర వర్ధమాన దేశాల మార్కెట్ల కన్నా భారత్‌ మంచి ప్రదర్శన చూపుతుందన్నారు. భారత సంస్కరణల ప్రభావం ఇంకా పూర్తిస్థాయిలో కనిపించాల్సిఉందన్నారు. దీర్ఘకాలానికి

Most from this category