వారం గరిష్టం వద్ద నిఫ్టీ ముగింపు
By Sakshi

ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులతో ఊగిసలాడిన సూచీలు.. బ్యాంకింగ్, టెలికాం షేర్ల ర్యాలీతో పాటు ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ర్యాలీతో చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 185.51 పాయింట్లు పెరిగి 40,469.70 వద్ద, నిఫ్టీ 55.60 పాయింట్ల లాభంతో 11,940.10 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ ఇండెక్స్ ఈ ముగింపు స్థాయి వారం రోజుల గరిష్ట స్థాయి కావడం విశేషం. మార్కెట్ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 244.15 పాయింట్లు పెరిగి 31,236.25 వద్ద స్థిరపడింది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేర్లు ఇంట్రాడేలో 3.81శాతం ర్యాలీ చేసి 1,514.90 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేయడం, టెలికాం రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎయిర్టెల్(9శాతం), ఐడియా వొడాఫోన్(38శాతం) ర్యాలీ సెంటిమెంట్‌ను బలపరిచింది. మిడ్ సెషన్ సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఫార్మా షేర్ల ర్యాలీ సూచీల పతనానికి అడ్డుకట్ట వేసింది. మరోవైపు అటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో నిప్టీ 11,881.75- 11,958.85 రేంజ్లో కదలాడగా, సెన్సెక్స్ 40,290.21-40,544.13 శ్రేణిలో కదలాడింది. నేడు నిఫ్టీ ఇండెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే 39.56 పాయింట్లు కాగా, భారతీ ఎయిర్టెల్ 14.51, యాక్సిస్ బ్యాంక్, 14 పాయింట్లను అందించాయి. టీసీఎస్ 10 పాయింట్లు, హెడీఎఫ్సీ 9 పాయింట్ల మేర నిఫ్టీని నష్టపర్చాయి. ‘‘ మార్కెట్ ఓవరాల్‌గా బుల్లిష్‌గా ఉంది. నిఫ్టీ ఇండెక్స్ 11850 వద్ద కీలక మద్దతును ఏర్పాటు చేసుకుంది. రేపు నిఫ్టీ 11950 పైన ప్రారంభమైనట్లైతే తుదుపరి 12000, 12100 స్థాయిని అందుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని సెబి రిజిస్ట్రర్ సాంకేతిక నిపుణుడు సిమి భౌమిక్ అభిప్రాయపడ్డారు. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫ్రాటెల్ షేర్లు 3శాతం నుంచి 11శాతం వరకు లాభపడ్డాయి. టాటాస్టీల్, టీసీఎస్, జీ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, యస్‌బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోయాయి.
You may be interested
‘టాటా ఫోకస్డ్ ఈక్విటీ’లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Tuesday 19th November 2019టాటా మ్యూచువల్ ఫండ్ (ఏఎంసీ) టాటా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ పేరుతో నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 29న ముగియనుంది. ఆసక్తిగల ఇన్వెస్టర్లు గడువులోపు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, ముందుగా నిపుణులు, ఫైనాన్షియల్ ప్లానర్ల అభిప్రాయాలను తెలుసుకోవడం ఉపయోగకరం. యాక్టివ్‌గా నిర్వహించే ఏ ఈక్విటీ
యస్ బ్యాంక్‌కు రాణాకపూర్ సంస్థలు గుడ్‌బై!
Tuesday 19th November 2019రాణా కపూర్ ప్రమోటర్‌గా ఉన్న యస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్, యస్ బ్యాంక్‌లో తమకున్న మిగిలిన 0.8 శాతం వాటాను విక్రయించాయి. ఈ విషయాన్ని యస్ బ్యాంక్ మంగళవారం ఎక్సేంజ్‌కు తెలిపింది. ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం..ఈ ప్రమోటర్ కంపెనీలు ఓపెన్ మార్కెట్ ద్వారా నవంబర్ 13-14 తేదీలలో 2.04 కోట్ల షేర్లను విక్రయించాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు కేవలం 900 యస్ బ్యాంక్ షేర్లను మాత్రమే కలిగివుండడం గమనార్హం. ప్రమోటర్లు