News


రెండోరోజూ అదే జోరు

Thursday 12th December 2019
Markets_main1576147066.png-30194

  • 11950 పైన ముగిసిన నిఫ్టీ 
  • 169  పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల జోరు రెండోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 169 పాయింట్లు పెరిగి 40582 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 11950పై 11,972 వద్ద ముగిసింది. రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగ షేర్లకు తప్ప మిగిలిన​అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 409 పాయింట్లు లాభపడి 31,665 వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మన మార్కెట్లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లను ఆర్జించి  40,712 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 95 పాయింట్లు లాభపడి 12005 స్థాయిని అందుకుంది. అయితే నేటి మార్కెట్‌ ముగింపు అనంతరం నవంబర్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు, అక్టోబర్‌ పారిశ్రామిక గణాంకాలు విడుదల కానున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దీంతో మార్కెట్లో చివర్లో సూచీలు కొంత​అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1శాతం లాభపడగా,  నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.50శాతం ర్యాలీ చేసింది. 
ఎస్‌బీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, వేదాంత, యస్‌ బ్యాంక్‌, టాటామోటర్స్‌ షేర్లు 3శాతం నుంచి  7శాతం వరకు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

కొత్త ఏడాదికి టాప్‌ 10 సిఫార్సులు

Thursday 12th December 2019

వచ్చేఏడాదిలో మంచి రాబడిని ఇచ్చే టాప్‌ 10 షేర్లను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. అలెంబిక్‌ ఫార్మా: బాబ్‌కాప్స్‌ రిసెర్చ్‌ నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 660. ఎర్నింగ్స్‌ మందకొడిగా ఉండడంతో నాలుగేళ్లుగా ఈ షేరు అంతంతమాత్రపు ప్రదర్శన చేస్తోంది. తాజాగా ఎర్నింగ్స్‌ సైకిల్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. ఇది ఇకపై 3-4 ఏళ్లు కొనసాగవచ్చు. 2024-25 నాటికి ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 20 శాతాన్ని దాటుతుందని అంచనా. ఇప్పటివరకు వెచ్చించిన

రికార్డుస్థాయికి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

Thursday 12th December 2019

కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఈ బ్యాంకు షేరు రూ.1689.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రైవేట్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా షేరు ఒక దశలో 1.75శాతం పెరిగి రూ.1714.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధరకు షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం.తద్వారా నేటి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో జీవితకాల గరిష్టాన్ని అందుకున్న ఏకైక

Most from this category