Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Audi Q3 and Q3 Sportback Bold Edition launched in India
భారత్‌లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్‌లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్‌ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్‌పై గ్లోస్ బ్లాక్ ట్రీట్‌మెంట్, ఫ్రంట్ బంపర్‌పై ఎయిర్ ఇన్‌టేక్ సరౌండ్‌లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్‌లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024

Industrial production growth slows to 4. 9percent in March
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్‌ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్‌ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్‌ 1.2 6.8 విద్యుత్‌ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్‌ గూడ్స్‌ 6.1 10 కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 9.5 – 8.0 కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 4.9 –1.9 ఇన్‌ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్‌ 2.5 3.3 ఇంటరీ్మడియట్‌ గూడ్స్‌ 5.1 1.8

Sensex rises 500 points tracking positive cues from global markets
వరుస నష్టాలకు బ్రేక్‌

ముంబై: స్టాక్‌ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్‌ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్‌ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్‌ మెటల్‌ ఎక్సే్చంజీలో బేస్‌ మెటల్‌ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్‌ ప్రకటించడంతో బీపీసీఎల్‌ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Asia Gold Sky high prices take shine off Indian gold buying festival
పసిడికి అక్షయ తృతీయ శోభ

ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్‌ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.పసిడి దిగుమతులు 30 శాతం అప్‌ కాగా భారత్‌ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్‌ దీనికి కారణం. భారత్‌కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్‌ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్‌ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్‌ డాల ర్లుగా నమోదైంది.

Jio bundles 15 apps including Netflix with Rs 888 broadband plan
జియో గుడ్‌న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా 15 ఓటీటీ యాప్స్‌

జియో ఫైబర్‌ తమ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తో సహా 15 యాప్‌ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌.నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్‌ని కలిగి ఉన్న జియోఫైబర్‌ (JioFiber) కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్‌ ప్లాన్‌తో కస్టమర్‌లకు ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్‌ ఫైబర్‌ (AirFiber) కస్టమర్‌ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్‌లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్‌ల సేవల్లో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్‌బాలాజీ వంటివి ఉన్నాయి.

Stock Market Rally On today Closing
పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. గడిచిన సెషన్‌లో భారీగా నష్టపోయిన సూచీల్లో ఈరోజు రిలీఫ్‌ ర్యాలీ కనిపించింది. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 22,047 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 245 పాయింట్లు పుంజుకుని 72,652 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, భారతీఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Heavy rain led to water leakage at KIA Terminal 2 in Bengaluru, 17 flights effected
బెంగళూరులో భారీ వర్షం.. 17 విమానాలు దారి మళ్లింపు

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కురిసిన వర్షం కారణంగా 17 విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించిన వివరాలను విమానయాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి.బెంగళూరులో గురువారం కురిసిన భారీ వర్షానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2(టీ2) వద్ద భారీగా నీరు చేరింది. టీ2 లగేజీ తీసుకునే ప్రాంతం సమీపంలో పైకప్పు నుంచి నీరు లీకవ్వడం గుర్తించారు. క్షణాల్లో వర్షం పెరగడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు రావాల్సిన విమానాలను చెన్నైకి మళ్లించారు. మొత్తం 13 దేశీయ విమానాలు, మూడు అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు, ఒక అంతర్జాతీయ కార్గో విమానాన్ని దారి మళ్లించారు. బలమైన గాలుల కారణంగా రాత్రి 9:35 నుంచి 10:30 గంటల వరకు విమానాల ల్యాండింగ్‌ వీలుకాలేదని ఎయిర్‌పోర్ట్‌ ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించి విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్‌ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టీ2 టెర్మినల్‌ నిర్మాణాన్ని రూ.5,000 కోట్లతో 2022లో పూర్తి చేశారు. అందులో జనవరి 15, 2023 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. టెర్మినల్‌ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఇలా లీకేజీలు ఏర్పడడంపట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Paytm UPI Payments come up with new strategy
పేటీఎం కొత్త వ్యూహం

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం ఇటీవల తన పేమెంట్స్‌ బ్యాంక్‌ను రద్దు చేయడంతో తమకు తిరుగులేదని ప్రత్యర్థి కంపెనీలు సంబరపడిపోయాయి. కానీ వాటికి దీటైన సమాధానం ఇస్తూ తిరిగి మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు పేటీఎం సరికొత్త ప్లాన్‌ చేసింది. థర్డ్ పార్టీ పేమెంట్ సేవల కోసం ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. యాప్‌లో యూపీఐ లావాదేవీలు చేస్తే ఏకంగా రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది.పెద్దనోట్ల రద్దు సమయంలో దాదాపు దేశం అంతటా ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలందించిన పేటీఎం..క్రమంగా తన సబ్‌స్రైబర్లను పెంచుకుంది. వారికి మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా పేమెంట్స్‌ బ్యాంక్‌ను ప్రారంభించింది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి షాపింగ్‌ వరకు డబ్బుతో ముడిపడిన చాలా కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. నేరుగా క్రెడిట్‌కార్డులు ఇచ్చే స్థాయికి చేరింది. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) లావాదేవీల్లో ముందువరుసలో నిలిచింది. టోల్‌గేట్ల వద్ద ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం తన వినియోగదారులకు ఫ్యాస్టాగ్‌ సర్వీస్‌ను అందించింది.ఇటీవల కొంతమంది పేటీఎం యూజర్ల ఖాతాల్లో పరిమితులకు మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. దాంతో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తన వినియోగదారులు పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారానే యూపీఐ సేవలు వినియోగించుకునేవారు. ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో ప్రత్యర్థి కంపెనీలు ఒకింత సంబరపడిపోయాయి. వాటికి ధీటైన సమాధానం చెబుతూ ఎన్‌పీసీఐ ద్వారా థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (టీపీఏపీ) లైసెన్స్‌ను సంపాదించింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తోంది.బ్యాంకింగ్‌ సేవలిందిస్తున్న యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌లు పేటీఎంకు పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్‌ బ్యాంక్‌ సేవలందిస్తోంది. @paytm యూపీఐ హ్యాండిల్‌ కలిగిన మర్చంట్‌ పేమెంట్స్‌ యస్‌ బ్యాంక్‌కు రీడైరెక్ట్‌ అయ్యాయి.ఇదీ చదవండి: ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!మార్కెట్‌లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకునేలా యూజర్లు క్యాష్‌బ్యాంక్‌ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు చేస్తూ రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందేలా వీలుకల్పిస్తుంది. అమెజాన్‌ పే, గూగుల్‌ పే, ఫోన్‌పేలతో సహా ఇప్పటికే దేశంలో 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి.#Paytm is India’s favourite payment app! 🚀 Now, better with power of 4 banks Get assured Rs 100 cashback on UPI payments using Paytm app. Download now: https://t.co/750WzmXs4E #PaytmKaro @YESBANK @AxisBank @HDFC_Bank @TheOfficialSBI pic.twitter.com/5MpOIj8owT— Paytm (@Paytm) May 3, 2024

Gold Price Today On Akshaya Tritiya [May 10, 2024]
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!

నేడు అక్షయ తృతీయ. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ల కోలాహలం నెలకొంది. ఈ తరుణంలో బంగారం ధరలు ఈరోజు (మే 10) కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. రెండు తగ్గుముఖం పట్టి ఊరట కలిగించిన పసిడి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.930 పెరిగి రూ. 73,090 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.930 ఎగసి రూ.73,240 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.930 పెరిగి రూ.73,090 వద్దకు చేరింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,050 ల​కు, 24 క్యారెట్ల బంగారం రూ.990 పెరిగి రూ.73,150 లకు చేరుకుంది. ➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 ఎగిసి రూ.67,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.930 పెరిగి రూ.73,090 లకు ఎగిసింది.వెండి కూడా భారీగా..అక్షయ తృతీయ వేళ దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు ఏకంగా రూ.1300 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.86,500లుగా ఉంది.

Simpl trims around 15% of workforce, CEO apologizes in Town Hall
వందలాది ఉద్యోగుల తొలగింపు.. సారీ చెప్పిన సీఈవో

ఫిన్‌టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు 100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్‌లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్‌ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. లేఆఫ్‌ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement