News


11,900పైన నిఫ్టీ ముగింపు

Tuesday 2nd July 2019
Markets_main1562064200.png-26744

130 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 
ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్లు లాభపడి 39,816.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44పాయింట్లు పెరిగి 11900 పైన 11,910.35 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా రెండో రోజు లాభాల ముగింపు. డాలర్‌ మారకంలో రూపాయి (9 పైసలు) బలహీనపడటంతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్‌, ఎఫ్‌ఎంజీసీ, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో రంగ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఫార్మా, బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 89 పాయింట్లు తగ్గి 31,283.30 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 339 పాయింట్ల రేంజ్‌లో 39,499.19 - 39,838.49 స్థాయిలో కదలాడగా, నిఫ్టీ 103 పాయింట్ల స్థాయిలో 11,814.70 - 11,917.45 శ్రేణిలో కదలాడింది.
339 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌:- 
ఆసియా మార్కెట్ల నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., నేడు దేశీయ మార్కెట్‌ లాభంతో మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ సెంచరీ లాభాలను ఆర్జించగా, నిఫ్టీ 11900 పాయింట్ల స్థాయిని అందుకుంది. ప్రపంచమార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వాతావరణం, దేశీయ ఆర్థిక వ్యవస్థలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు, వారాంతపు రోజు శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల  అప్రమత్తత,  తదితర అంశాలతో సూచీలు మార్కెట్‌ ప్రారంభంలో ఆర్జించిన లాభాల్ని కోల్పోయాయి. ఈ క్రమంలో సెన్సక్స్‌ 191 పాయిం‍ట్లను కోల్పోయి 39,499.19 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లను కోల్పోయి 11,814.70 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌లో ఇండెక్స్‌లో అధిక వెయిటీజి కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడం, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు 1నుంచి 3శాతం ర్యాలీ చేయడంతో సూచీలు తిరిగి నష్టాలను పూడ్చుకోగలిగాయి. 

ఐషర్‌ మోటర్స్‌, ఐఓసీ, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, టాటామోటర్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 8శాతం నష్టపోయాయి. 
 You may be interested

మిడ్‌క్యాప్‌ ర్యాలీ మొదలైతే ఎక్స్‌ప్రెస్సే: గౌతంషా

Tuesday 2nd July 2019

మిడ్‌క్యాప్‌ ఇప్పటికే బోటమ్‌ అవుట్‌ అయ్యాయని, లార్జ్‌క్యాప్‌లోనే దిద్దుబాటు జరగాల్సి ఉందన్నారు జేఎం ఫైనాన్షియల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ గౌతంషా. మార్కెట్‌ గమనంపై మాట్లాడుతూ... మే 23 ఎన్నికల ఫలితాల నుంచి మార్కెట్‌ గమనం అంత ప్రోత్సాహకరంగా లేదన్నారు. మార్కె్ట్‌ ర్యాలీ చేసిన ప్రతీ సారీ దిద్దుబాటుకు గురవుతోందని, అలాగే, స్వల్పంగా పడిపోయిన ప్రతీసారి ఎంతో మూమెంటమ్‌ ఉంటున్నట్టు చెప్పారు. మార్కెట్‌ పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. మధ్య కాలానికి మాత్రం

ఈ ఆరు స్టాకులు లార్జ్‌క్యాప్‌లోకి...

Tuesday 2nd July 2019

ఏఎంఎఫ్‌ఐ మెథడాలజీ ప్రకారం లార్జ్‌క్యాప్‌లోకి 6 స్టాకులు..  మిడ్‌ క్యాప్‌లోకి 23 స్టాకులు చేరనున్నాయి : ఈస్ట్‌ ఇండియా సెక్యురిటీస్‌  దీర్ఘకాలానికి మిడ్‌ క్యాప్‌లో పెట్టుబడులు మంచిదే లార్జ్‌క్యాప్‌లోకి కొత్తగా కంపెనీలు.. బెంచ్‌మార్కు సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ ఏడాది మొదటి ఆరు నెలలో 9 శాతం లాభపడ్డాయి. ఈ లాభాలలో లార్జ్‌ క్యాప్‌ల పాత్ర చాలా కీలకమైనది. ఇప్పుడు ద్వితియార్థం మొదలుకానుంది. మూచ్యువల్‌ ఫండ్‌ల అసోసియేషన్‌(ఏఎంఎఫ్‌ఐ) మెథడాలజీ ప్రకారం లార్జ్‌క్యాప్‌ విభాగంలోకి కొత్తగా ఆరు కంపెనీల

Most from this category