STOCKS

News


బ్యాంకింగ్‌..బ్రెగ్జిట్‌...సూచీలకు భారీ లాభాలు.!

Thursday 17th October 2019
Markets_main1571309555.png-28958

ఫైనాన్షియల్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడంంతో దేశీయ మార్కెట్‌ గురువారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 453 పాయింట్లు లాభపడి 39000ల పైన 39,052.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 122 పాయింట్ల పెరిగి 11,586.35 వద్ద ముగిసింది. సెప్టెంబర్‌ 24 తరువాత సూచీలు ఈ స్థాయి వద్ద ముగియడం ఇదే తొలిసారి. మార్కెట్‌ మరో అరగంటలో ముగిస్తుందనే తరుణంలో బ్రెగ్జిట్‌ డీల్‌ కుదిరినట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ ప్రకటించడంతో మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ కొనసాగి, సూచీలు పటిష్టంగా ముగిసాయి. సూచీలకిది వరుసగా ఐదో రోజూ లాభాల ముగింపు. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా అటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 29000 స్థాయిని తాకి చివరికి 450 పాయింట్లు లాభపడి 28,989.45 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 505 పాయింట్లు లాభపడి 39,104.69 స్థాయిని, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 11,599.10 రేంజ్‌ని తాకాయి. ‘‘ ప్రపంచ ఆర్థిక ఆందోళనకు కారణమైన రెండు అంశాలు బ్రెగ్జిట్‌, అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం. ఇప్పుడు బ్రెగ్జిట్‌ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఇక రెండో సమస్య అమెరికా-చైనాల మద్య కూడా ఒకదశ ఒప్పందం ఖరారయ్యింది. ‘అప్‌ట్రెండ్‌ కొనసాగితే నిఫ్టీ ఇండెక్స్‌ 11700స్థాయిని పరీక్షిస్తుంది. డౌన్‌సైడ్‌లో 11300 వద్ద మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది’’ అని ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ సాంకేతిక నిపుణుడు అమిత్‌షా అభిప్రాయపడ్డారు. 
యస్‌ బ్యాంక్‌, టాటామోటర్స్‌, ఐషర్‌మోటర్స్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, బజాజ్‌ అటో షేర్లు 15.50శాతం నుంచి 4శాతం వరకు లాభపడ్డాయి. ఇన్ఫ్రాటెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, గ్రాసీం, వేదాంత, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం వరకు నష్టపోయాయిYou may be interested

ఇవి మల్టీ బ్యాగర్లేనా..?

Friday 18th October 2019

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగం గణనీయంగా దిద్దుబాటుకు గురైన ఈ తరుణంలో.. ఓ స్టాక్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల రానున్న కాలంలో మల్టీబ్యాగర్‌గా మారొచ్చేమో..?! కాకపోతే ఇదంతా ఎంపికలోనే ఉంటుంది. మల్టీబ్యాగర్‌ అయ్యే స్టాక్స్‌ను గుర్తించడం ఎలా..? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఇప్పటికే మల్టీబ్యాగర్‌ రిటర్నులు ఇచ్చిన వాటిని పరిశీలిస్తే కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు.   సహ్‌యోగ్‌ మల్టీబేస్‌. గత దీపావళి నుంచి ఇప్పటికి 1,755

ఐఆర్‌సీటీసీని ఇంత తక్కువకు విలువ కడతారా?!

Thursday 17th October 2019

రైల్వే శాఖ నిరసన ఐఆర్‌సీటీసీ ఐపీఓ ధరపై భారతీయ రైల్వే శాఖ నిరసన వ్యక్తంచేసింది. తాజాగా లిస్టయిన ఐఆర్‌సీటీసీ తొలిరోజు దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. షేరు ఆరంభంలో దాదాపు 100 శాతానికి పైచిలుకు లాభపడింది. ఈ నేపథ్యంలో షేరు ఆఫర్‌ ధరను అంత తక్కువగా నిర్ణయించడంపై రైల్వే శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సరైన విచారణ జరపాలని, అప్పుడే భవిష్యత్‌లో పీఎస్‌యూ కంపెనీల పబ్లిక్‌ ఆఫర్లకు మంచి

Most from this category