News


లాభాలు కొనసాగాయ్‌

Wednesday 6th March 2019
Markets_main1551868067.png-24456

11050పై నిఫ్టీ ముగింపు
మూడరోజూ లాభాలే.

ప్రపంచ మార్కెట్లలలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., దేశీయ మార్కెట్లో మూడోరోజూ లాభాలు కొనసాగాయి. ఆర్థిక ఐటీ, ఫార్మా, మెటల్‌ షేర్ల అండతో  సెన్సెక్స్‌ 193 పాయింట్లు పెరిగి 36,636 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 11,053 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 72 పాయింట్ల స్వల్ప లాభంతో 27,625 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అటో, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా షేర్లలో కొనుగోళ్లు అధికంగా జరిగాయి. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం, దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం తదితర కారణాలతో నేడు మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభంతో 36,544 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11000 పైన 11,025 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(3శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(2.50శాతం), ఐటీసీ(2శాతం), బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీతో సూచీలు ఆరంభలాభాల్ని నిలుపుకోలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 224 పాయింట్లు పెరిగి 36,666 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లను ఆర్జించి 11,062 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. 
వేదాంత, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడగా, హిందూస్థాన్‌ యూనిలివర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, టాటామోటర్స్‌, జీలిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోయాయి.



You may be interested

రెండంకెల్లో రాబడులకు ఎడిల్‌వీజ్‌ బెట్స్‌

Wednesday 6th March 2019

ప్రపంచ మార్కెట్లకు భౌగోళిక ఉద్రిక్తతలు, వృద్ధి మాంద్యం వంటి రిస్క్‌లు వున్నాయని, అయితే ఏడాదికాలంగా భారీగా పతనమైన మిడ్‌క్యాప్‌ షేర్లలో కొన్ని రానున్న రోజుల్లో మంచి రాబడులు ఇచ్చే అవకాశం వుందని బ్రోకరేజ్‌ సంస్థ ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2017లో పెద్ద ర్యాలీ జరిపి, 2018లో భారీ పతనాన్ని చవిచూసి, ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ క్షీణిస్తూ వచ్చిన కొన్ని మిడ్‌క్యాప్‌ షేర్లు కొనుగోలుకు అనుకూలంగా వున్నాయని ఎడిల్‌వీజ్‌ వివరించింది.

సూచీలకు ఆర్‌ఐఎల్‌ అండ

Wednesday 6th March 2019

బుధవారంనాటి సూచీల స్థిరమైన ర్యాలీకి  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌అండగా నిలిచింది.  చివరి రెండు సెషన్స్‌లో సూచీలు భారీగా లాభాలు ఆర్జిం‍చినప్పటికి.., ఈ షేరు స్తబ్దుగా ట్రేడైంది. నేడు ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో దాదాపు 3శాతం ర్యాలీ చేసి రూ.1271.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు 3శాతం ర్యాలీ చేయడంతో ఈ ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ

Most from this category