News


10800 పైన ముగిసిన నిఫ్టీ

Friday 23rd August 2019
Markets_main1566555474.png-27976

  • 228 పాయింట్ల పెరిగిన సెన్సెక్స్‌ 
  • మూడు రోజుల నష్టాలకు ముగింపు 
  • రాణించిన మెటల్‌, ఐటీ, ఫార్మా షేర్లు

మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు శుక్రవారం తెరపడింది. సెన్సెక్స్‌ 228 పాయింట్ల లాభంతో 36701 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 88 పాయింట్లు పెరిగి 10829.35 వద్ద స్థిరపడింది. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లు, ఎఫ్‌ఎంజీసీ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ లాభపడ్డాయి. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 75 పాయింట్లు నష్టపోయి 27000 దిగువన 26,958.65 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 705 పాయింట్ల రేంజ్‌లో 36,102.35 - 36,807.34 శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ 224 పాయింట్ల శ్రేణిలో 10,985.30 - 11,076.30 స్థాయిలో కదలాడింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేటి సాయంత్రం ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్న నేపథ్యంలో కుదేలైన దేశీయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉద్దీపన చర్యలు ప్రకటించనవచ్చనే అంచనాలు ఎఫ్‌పీఐలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన సర్‌ఛార్జీలను విధింపును కేంద్రం ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు తాజాగా వార్తలు వెలుగులోకి రావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి విలువ 8నెలల కనిష్టం నుంచి 19 పైసలు రికవరీ కావడం, ఇటీవల భారీగా పతమైన షేర్లలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకోవడం మార్కెట్‌కు కలిసొచ్చింది. అలాగే నేడు ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ జాక్సన్‌ హోల్‌ ఆర్థిక సదస్సులో ప్రసగించినున్న నేపథ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు ఎక్కువగా అవకాశాలున్నాయనే అశాభావంతో అటు ఆసియా మార్కెట్ల లాభాల ముగింపుతో యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం దేశీయ ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. 
బీపీసీఎల్‌, యస్‌బ్యాంక్‌, వేదాంత, యూపీఎల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 5.50శాతం నుంచి 6.50శాతం వరకు లాభపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐషర్‌మోటర్స్‌, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ అరశాతం నుంచి 2శాతం నష్టపోయాయి. You may be interested

ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టిన బ్యాంకులు మనవే

Saturday 24th August 2019

అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టిన టాప్‌-10 బ్యాంకుల్లో 7 ‍బ్యాంకులు మన దేశానివే కావడం ఆశ్చర్యం కలిగించకమానదు. బ్లూంబర్గ్‌ డేటాను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. మన బ్యాంకులకు ఇక ముందూ మరిన్ని గడ్డు రోజులు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మొండి బకాయిల భారాన్ని మన బ్యాంకులు మోస్తున్న విషయం విదితమే.   మన దేశ ఆర్థిక రంగం మందగమనంలోకి వెళ్లిన నేపథ్యంలో బ్యాంకులు ఎన్‌పీఏల పరంగా మరిన్ని సవాళ్లను

ఉద్దీపనల కోసం పీఎంఓతో ఆర్థిక శాఖ మంతనాలు?

Friday 23rd August 2019

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీతో సిద్ధమవుతోందని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌, ఆటో, రియల్‌ ఎస్టేట్‌, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎస్‌ఎంఈ) వంటి నాలుగు కీలకమైన సెక్టార్‌లలో పాలసీలను తీసుకురావలని పీఎంఓతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త వెలువడిన తర్వాత పతనంలో ఉన్న మార్కెట్లు తిరిగి కోలుకోవడం గమనార్హం. మధ్యాహ్నాం 2.32 సమయానికి నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి

Most from this category