News


ఇటు కశ్మీర్‌...అటు చైనా..కుప్పకూలిన స్టాక్‌ సూచీలు

Monday 5th August 2019
Markets_main1565001558.png-27553

418 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 
135 పాయింట్లు నష్టపోయి నిఫ్టీ 
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణతో పాటు 35(ఎ) అధికరణ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో పాటు అమెరికా-చైనాల మధ్య ఉధృతమవుతున్న వాణిజ్యయుద్ధ ప్రభావంతో  ప్రపంచ మార్కెట్లు నిలువునా పతనమైన నేపథ్యంలో భారత మార్కెట్‌ సోమవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 418 పాయింట్లను కోల్పోయి 37000 దిగువను 36,699.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి 10,862.60 ముగిసింది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి భారీగా బలహీనపడటం కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ ఒకదశలో 700 పాయింట్లు నష్టపోయి 36,416.79 వద్ద నిఫ్టీ ఇండెక్స్‌ 214 పాయింట్లు క్షీణించి 10,782.60 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రూపాయి బలహీనతతో ఒక్క ఐటీ ఇండెక్స్‌ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లల్లో విక్రయాలు విరివిగా జరిగాయి. బ్యాంకింగ్‌, ఆర్థికరంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం క్షీణించి 27,648.05 వద్ద స్థిరపడింది. 
గ్రాసీం, పవర్‌ గ్రిడ్‌, టాటా మోటర్స్‌, యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం నుంచి 8.50శాతం నష్టపోగా, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ అటో, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

రేటింగ్‌ కట్‌.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డౌన్‌

Monday 5th August 2019

విదేశీ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్ సూసీ ముఖేష్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు టార్గెట్‌ ధరను 26 శాతం తగ్గించడంతో ఈ కంపెనీ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 3.66 శాతం నష్టపోయి రూ.1,141.00 వద్ద ముగిసింది. ఈ బ్రోకరేజి రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను ‘న్యూట్రల్’ నుంచి ‘అండర్‌పెర్‌ఫార్మ్’ కి తగ్గించింది. అంతేకాకుండా ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ.1,350 నుంచి రూ.995కు తగ్గించింది. ఆర్థిక సంవత్సరం 2021/22లో

ఎయిర్‌టెల్‌ మరో 4 శాతం జంప్‌

Monday 5th August 2019

మార్కెట్లు నిలువునా పతనమవుతన్నా....ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 ఫలితాలను ప్రకటించిన తర్వాత నుంచి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఎయిర్‌టెల్‌ సోమవారం ట్రేడింగ్‌లో 4.53 శాతం లాభపడి రూ. 359.10 వద్ద ముగిసింది. కాగా మార్కెట్లు తీవ్రంగా నష్టపోయినప్పటికి ఎయిర్‌టెల్‌ మాత్రం లాభపడి ముగియడం గమనార్హం. గత సెషన్‌లో కూడా ఈ కంపెనీ షేరు 6 శాతం లాభపడి రూ. 343.55 వద్ద క్లోజయ్యింది.  మొత్తంగా ఈ రెండు

Most from this category