News


పీఎస్‌యూ షేర్లకు అమ్మకాల షాక్‌

Friday 31st January 2020
Markets_main1580452999.png-31368

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంపై అంచనాల ఎఫెక్ట్‌
8 శాతం పతనమైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌

సాధారణ వార్షిక బడ్జెట్‌ విడుదలకు ముందురోజు ఉన్నట్టుండి ప్రభుత్వ రంగ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొన్ని కౌంటర్లలో భారీ అమ్మకాలకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ కంపెనీలతో కూడిన నిఫ్టీ సీపీఎస్‌ఈ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం క్షీణించింది. వెరసి 2016 ఫిబ్రవరి తదుపరి కనిష్టానికి చేరింది. మధ్యాహ్నం 12 ప్రాంతంలో 1724 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం నిఫ్టీ సీపీఎస్‌ఈ ఇండెక్స్‌ 2016 ఫిబ్రవరి 12న 1758కు చేరింది. సీపీఎస్‌ఈ కౌంటర్లలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ భారీగా పతనం‍కాగా.. ఆయిల్‌ రంగ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా 52 వారాల కనిష్టాలను తాకాయి. వారాంతాన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం పెరగనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. లక్ష్యాన్ని అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయాన్ని వేగవంతం చేసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అమ్మకాలు ఊపందుకున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. 

చమురు షేర్లు బేర్‌
సీపీఎస్‌ఈ కౌంటర్లలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ 8.25 శాతం పతనమై రూ. 92కు చేరగా.. ఆయిల్‌ ఇండియా 6 శాతం వెనకడుగుతో రూ. 130ను తాకింది. ఓఎన్‌జీసీ 4 శాతం క్షీణించి రూ. 111 వద్ద, పవర్‌గ్రిడ్‌ 4 శాతం నీరసించి రూ. 187 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ 2.6-1.8 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. బీఎస్‌ఈలో సీపీఎస్‌ఈలో భాగమైన ఇతర కౌంటర్లలో ఆర్‌ఈసీ, ఐవోసీ, హెచ్‌వోసీఎల్‌, పీఎఫ్‌సీ, మిధానీ, ఇర్కాన్‌, గెయిల్‌, బీపీసీఎల్‌ తదితరాలు 3-2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి.



You may be interested

స్వల్పకాలానికి టాప్‌ సిఫార్సులు

Friday 31st January 2020

వచ్చే మూడు నాలుగువారాల్లో మంచి రాబడినిచ్చే మూడు సిఫార్సులను బ్రోకరేజ్‌లు అందిస్తున్నాయి. 1. బెర్గర్‌ పెయింట్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 540. స్టాప్‌లాస్‌ రూ. 585. గతేడాది జూలై నుంచి అప్‌మూవ్‌ చూపుతూ సరైన పతనం లేకుండా దాదాపు 90 శాతం దూసుకుపోయింది. చివరకు రూ. 580 వద్ద నిరోధం ఎదుర్కొంది. అప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఐ నెగిటివ్‌గా మారింది. ప్రస్తుతం షేరు కరెక‌్షన్‌ బాటలో ఉంది. 2. భారతీ ఎయిర్‌టెల్‌: కొనొచ్చు. టార్గెట్‌

కొటక్‌ మహీంద్రా, యాంబర్‌.. జోరు

Friday 31st January 2020

52 వారాల గరిష్టాన్ని తాకిన యాంబర్‌ 4 శాతం జంప్‌చేసిన కొటక్‌ మహీంద్రా కొద్ది సమయంలో ఆర్థిక సర్వే వెలువడనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఉదయం 10.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 40,915కు చేరగా.. నిఫ్టీ 11 పాయింట్లు తక్కువగా 12,025 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, వైట్‌గూడ్స్‌ కాంట్రాక్ట్‌

Most from this category