STOCKS

News


ఈ వారం 11200పాయింట్ల వరకు ర్యాలీ?!

Tuesday 10th September 2019
Markets_main1568111028.png-28289

నిఫ్టీపై నిపుణుల అంచనా
ఈ వారంలో నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏ స్థాయి 11200 వద్దకు చేరుతుందని టెక్నికల్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాల్‌ ఆప్షన్‌ విక్రేతలు(రైటర్లు) 10900 పాయింట్ల వద్ద  తమ షార్టు పొజిషన్లను(12వతేదీ ఎక్స్‌పైరీవి) కవర్‌ చేశారని, మరోవైపు 10800- 11000 పాయింట్ల(12వ తేదీ ఎక్స్‌పైరీవి) వద్ద పుట్‌ రైటింగ్‌ జరిపారని తెలియజేశారు. అందువల్ల క్రమంగా మార్కెట్‌ ఈ వారం ముందుకే సాగుతుందంటున్నారు. ముఖ్యంగా కాల్‌రైటర్లు షార్ట్‌కవరింగ్‌ చేయడం వల్ల మార్కెట్‌లో అప్‌మూవ్‌ వస్తుందని చెప్పారు. ఇదే సమయంలో ఒక స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద పుట్‌ రైటింగ్‌ ఎక్కువగా జరగడమంటే, ఆ ధర దిగువకు మార్కెట్‌ రాకపోవచ్చని అంచనాలున్నట్లు తెలిపారు. సోమవారం 10900 కాల్స్‌ ఓఐ(ఓపెన్‌ ఇంట్రెస్ట్‌) 3 లక్షల మేర తగ్గిపోగా, 11000 పాయింట్ల పుట్‌ ఓఐ 8 లక్షల మేర పెరిగింది. ఇదే సమయంలో 10900 పుట్‌ ఓఐ దాదాపు 10 లక్షల మేర పెరిగింది. అందువల్ల ఈవారంలో ఈ రెండు స్థాయిలు ప్రధాన మద్దతులుగా నిలిచే అవకాశాలున్నాయి.

నిఫ్టీ ప్రస్తుత అవరోధం 11100పాయింట్లను దాటేస్తే వారాంతానికి 11200 పాయింట్లను చేరుతుందని నిపుణుల అంచనా. 11200 పాయింట్ల వద్ద ఏమి జరుగుతుంది? అనేది మాత్రం ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు తెలిపారు. ఆప్షన్స్‌లో వీక్లీ ఆప్షన్‌ పీసీఆర్‌(పుట్‌కాల్‌ రేషియో)ను కేవలం అతిస్వల్ప వ్యవధికి మాత్రమే అంచనాలకు ఉపయోగిస్తామని, వారం తర్వాత ఎలా ఉంటుందో ఈ పీసీఆర్‌ ఆధారంగా చెప్పలేమని నిపుణుల వివరణ. గతవారంతో పోలిస్తే నిఫ్టీ వీక్లీ ఆప్షన్‌ పీసీఆర్‌ 1.21 నుంచి 1.54కు పెరిగింది. అందువల్ల ఈ వారం వరకైతే మార్కెట్‌ పాజిటివ్‌గానే ఉంటుందని ఎక్కువమంది అంచనా. 
 



You may be interested

టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3.17శాతం అప్‌..!

Tuesday 10th September 2019

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే ఒక్క ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు సోమవారం లాభాలతో ముగిశాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3శాతానికి పైగా పెరిగింది. టాటా మోటర్స్‌ ప్రధాన అనుబంధ సం‍స్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు యూరప్‌, అమెరికాలో తగ్గినప్పటికీ., చైనాలో మాత్రం పెరిగినట్లు సోమవారం సాయంత్రం డేటా విడుదల కావడం ఏడీఆర్‌ ర్యాలీకి కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 8.80 డాలర్ల వద్ద క్లోజయ్యింది. ఈ

1500డాలర్ల దిగువకు పసిడి

Tuesday 10th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 1500డాలర్ల దిగువకు తగ్గింది. ఆర్థిక మందగమనంలో ఉన్న వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలు ప్రకటించవచ్చనే అంచనాలు, అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య చర్చలు ఫలించవచ్చనే ఆశాహనంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తన పెట్టుబడులను రిస్క్‌ సాధనమైన స్టాక్‌ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గితోంది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్లో ఔన్స్‌ పసిడి ధర 17డాలర్లు క్షీణించి

Most from this category