News


11150 వరకు నిఫ్టీ పుల్‌బ్యాక్‌ ర్యాలీ?!

Wednesday 7th August 2019
Markets_main1565161718.png-27606

నిపుణుల అంచనా
మార్కెట్లలో వచ్చిన భారీ పతనం అనంతరం స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌ తప్పదని, ఇందులో భాగంగా షార్ట్‌టర్మ్‌లో నిఫ్టీ 11150 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో గరిష్ఠాల నుంచి సూచీలు ప్రస్తుతం దాదాపు 10 శాతం మేర పతనమయ్యాయి. బుధవారం సూచీలు స్వల్పశ్రేణిలో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 10800 పాయింట్ల స్థాయి కీలకమద్దతుగా నిలుస్తుందని, స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌ అనంతరం సూచీల ప్రవర్తన అంచనా వేయలేమని భావిస్తున్నారు.

  •  వారం రోజుల కాలపరిమితికి చూస్తే సూచీలు అప్‌మూవ్‌ చూపుతాయి. సూచీలు అన్ని ఇండికేటర్లలో ఓవర్‌సోల్డ్‌గా ఉన్నాయి. నెగిటివ్‌ సెంటిమెంట్‌ అతిసంతృప్తస్థాయికి చేరింది. నిఫ్టీ 11150 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ చూపవచ్చు. ఇందుకు ముందుగా 11030 పాయింట్లను దాటాల్సిఉంది.- షేర్‌ఖాన్‌ ఫండ్‌ మేనేజర్‌ రోహిత్‌ శ్రీవాస్తవ.
  •  సూచీల్లో షార్ట్‌పొజిషన్లు తగ్గుతున్నాయి. అయితే ఇదేసమయంలో చెప్పుకోదగ్గ లాంగ్స్‌ కొత్తగా పెరగలేదు. 11000 పాయింట్ల వద్ద కాల్‌రైటర్లు చురుగ్గా ఉన్నారు. అందువల్ల ఈ స్థాయి ప్రధాన నిరోధంగా ఉంటుంది. దిగువన 10800 పాయింట్లు మద్దతునిస్తుంది. 11050 పాయింట్లను దాటనంతవరకు నిఫ్టీ బేరిష్‌గా ఉన్నట్లు లెక్క. బ్యాంకు నిఫ్టీకి 28200- 28300 పాయింట్లు గట్టి నిరోధంగా ఉంటుంది. - యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ రాజేశ్‌ పల్వియా.
  •  మార్కెట్లు ఓవర్‌సోల్డ్‌గా ఉన్నాయి. నిఫ్టీ 11150 పాయింట్ల వరకు బౌన్స్‌బ్యాక్‌ చూపవచ్చు. 13 సెషన్ల తర్వాత మంగళవారం నిఫ్టీ హయ్యర్‌టాప్‌, బాటమ్‌ ఏర్పరిచింది. అందువల్ల పుల్‌బ్యాక్‌ కొనసాగవచ్చు. 11150 పాయింట్ల వద్ద 200 రోజుల డీఎంఏ ఉన్నందున నిరోధం ఎదురవుతుంది. అంతేకాకుండా ఈ స్థాయి మొత్తం పతనానికి 38 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి కావడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త షార్ట్స్‌ ఆచరణీయం కాదు.- ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ హెడ్‌ ధర్మేశ్‌ షా. 



You may be interested

బ్యాంకు నిఫ్టీ: నష్టాల్లోంచి లాభాల్లోకి

Wednesday 7th August 2019

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లు తగ్గింపు నేపథ్యంలో బుధవారం మిడ్‌ సెషన్‌ సమాయానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ నేడు 28,053.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ 142 పాయింట్లు నష్టపోయి 27,879.90 వద్ద ఇంట్రాడే కనిస్టాన్ని

బీమా స్టాకులపై ఎఫ్‌పీఐల మక్కువ

Wednesday 7th August 2019

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత కొద్దిరోజులుగా దేశీయ ఈక్విటీల్లో అమ్మకాలకు దిగారు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులకు మొగ్గు చూపే ఎఫ్‌పీఐలు మాత్రం ఇదే సమయంలో దేశీయ బీమారంగంపై మక్కువగా ఉన్నారు. ముఖ్యంగా గత ఏడాదిన్నరగా ఎఫ్‌పీఐల నిర్మాణాత్మక ఆలోచనాదోరణిలో మార్పు వచ్చింది. బీమారంగ విస్తరణకు భూరీ అవకాశం ఉన్నట్లు ఎఫ్‌పీఐలు గమనించాయి. మరోవైపు పలు బ్లూచిప్‌కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటాలు కిక్కిరిసినందున కొత్తగా బీమారంగంపై వీటి కన్నుపడింది. ఇప్పటికే దేశీయ బీమా

Most from this category