News


మూడోరోజూ లాభాల ముగింపే..!

Wednesday 20th November 2019
Markets_main1574245999.png-29736

 

  • ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌ 
  • 11999 వద్ద ముగిసిన నిఫ్టీ 
  • రాణించిన ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు 

సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఐనప్పటికీ వరుసగా మూడోరోజూ లాభంతో ముగిశాయి. ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్‌ 182 పాయింట్ల లాభంతో 40,652 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్ల పెరిగి 11999.10  వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా మూడోలాభాల ముగింపు కావడం విశేషం. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ వరుసగా 5రోజూ, స్టాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ వరుసగా 3రోజూ లాభాలతో ముగిశాయి. ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, అటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31353 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,576 - 40,816 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ 11,966 -12,038 స్థాయిలో ట్రేడైంది.  
కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌:- 
ప్రపంచమార్కెట్లో మిశ్రమ వాతావరణం నెలకొన్నప్పటికీ నేడు దేశీయ మార్కెట్‌ లాభంతో మొదలైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతి ఎయిర్‌టెల్‌లతో పాటు బ్యాంకింగ్‌ షేర్లు లాభాలతో ప్రారంభం కావడంతో భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 40,720 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 12,005 పాయింట్ల మొదలాయ్యాయి.  ఇంట్రాడేలో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రెండోరోజూ 4శాతానికి పైగా లాభపడి కొత్త గరిష్టాన్ని నమోదు చేయడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనంతో, రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు పెరిగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 346 పాయింట్ల వరకు లాభపడి 40,816.38 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అలాగే మరో ప్రధాన సూచీ నిఫ్టీ 98 పాయింట్ల వరకు లాభాల్ని ఆర్జించి 12,038.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. 
ఆరంభ లాభాల్ని నిలుపుకోలేకపోయిన సూచీలు:- 
ఉదయం సెషన్‌లో మార్కెట్లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. అయితే సూచీల గరిష్ట స్థాయి వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, సాంకేతికంగా నిఫ్టీ ఇండెక్స్‌ 12,038 స్థాయి కీలక నిరోధాన్ని అధిరోహించడంలో విఫలం కావడం, అలాగే మిడ్‌సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల మిశ్రమ ప్రారంభం తదితర అంశాలతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలయ్యాయి. మార్కెట్‌ చివరి గంట అమ్మకాలతో సూచీల లాభాల్ని కొంతవరకు హరించవేశాయి. ఫలితంగా నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 11,999 వద్ద, సెన్సెక్స్‌ 182 పాయింట్లు పెరిగి 40,651.64 వద్ద ముగిశాయి.


డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, సన్‌ఫార్మా, జీ లిమిటెడ్‌ షేర్లు 3శాతం నుంచి 8శాతం లాభపడ్డయి. టాటా స్టీల్‌, ఐషర్‌ మోటర్స్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐఓసీ, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

టెలికం షేర్లు ఇక రేసు గుర్రాలేనా?

Thursday 21st November 2019

వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ గత మూడు రోజుల్లో మంచి ర్యాలీ చేశాయి. ఒకవైపు ఏజీఆర్‌ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం)పై సుప్రీంకోర్టు తీర్పుతో ఈ రెండు కంపెనీకు కేంద్రానికి సుమారు రూ.90వేల కోట్ల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, ఈ తరహా ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ కష్టమంటూ వచ్చే నెల నుంచి మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచనున్నట్టు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రకటించడంతో వాటి

ఫార్చ్యున్‌ జాబితాలో సత్యనాదెళ్ల టాప్!

Wednesday 20th November 2019

 భారతి సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల, ఈ ఏడాది ‘ఫార్చ్యున్స్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితాలో ‍ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈయనతో పాటు భారతీ య సంతతికి చెందిన అజయ్‌ బంగా(మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ), జయశ్రీ ఉల్లాల్‌(ఆరిస్టా హెడ్‌) కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగి, ఆసాధ్యమైన అసమానతలను అధిగమించగలిగి, సృజనాత్మక పరిష్కారాలను కనుగొనే 20 వ్యాపార నాయకులను ఫార్య్చున్‌

Most from this category