News


10900 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 11th February 2019
Markets_main1549880242.png-24138

  • 151 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

బ్యాంకింగ్‌, ఫార్మా, అటో రంగ షేర్లలో అమ్మకాలతో మార్కెట్‌ సోమవారం నష్టాలతో ముగిసింది. వరుసగా మూడో రోజూ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ సూచీ 10900 మార్కును కోల్పోయి 55 పాయింట్ల నష్టంతో 10,888.80 వద్ద, సెన్సెక్స్‌ 151 పాయింట్లను కోల్పోయి 36,395 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంక్‌ ఇండెక్స్‌ 66 పాయింట్లను పతనమై 27,227.80 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌(అరశాతం లాభం), నిఫ్టీ మీడియా(1.50శాతం) తప్ప అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (1.75 శాతం) ఇండెక్స్‌ నష్టపోయింది. ఎఫ్‌ఎంజీసీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫార్మా, మెటల్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరగడంతో ట్రేడింగ్‌ ప్రారంభం‍లోనే నిఫ్టీ సూచీ 10900 మార్కును కోల్పోయింది. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది.  అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం సూచీలను భారీగా నష్టపరిచింది. ఫలితంగా మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా సెన్సెక్స్‌ సూచీ 246 పాయింట్లను నష్టపోయి 36,300 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి తగ్గింది. ఈ వారంలో బీఎస్‌ఈలో ఎక్చే‍్సంజ్‌లోని దాదాపు 2వేల కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను ప్రకటించనుండటం, రేపు రీటైల్‌, ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా సూచీలు చివరి వరకు నష్టాల ట్రేడింగ్‌నే కొనసాగించాయి.
అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 3శాతం నుంచి 5.50శాతం నష్టపోగా, జీలిమిటెడ్‌, టాటామోటర్స్‌, సిప్లా, టాటాస్టీల్‌, ఐఓసీ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.



You may be interested

రూ. పదిలక్షలున్నాయా? ఇలా ట్రై చేయండి..

Monday 11th February 2019

ప్రముఖ అనలిస్టులు సూచిస్తున్న మోడల్‌ పోర్టుఫోలియోలు 1. సందీప్‌ సభర్వాల్‌ డాట్‌కామ్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు... ---------------------------------------------------------------------------------------------     2. ఎడెల్‌వీజ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు... --------------------------------------------------------------------------------------------------- 3. కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు... ---------------------------------------------------------------------     4. 5నాన్స్‌ డాట్‌కామ్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు...

ఐటీ, బ్యాంకింగ్‌లో ఈ షేర్లు బెటర్‌!

Monday 11th February 2019

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సూచనలు రాజకీయ అస్థిరతలు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు భారీగా పెట్టుబడులు ప్రస్తుతానికి పెట్టకపోవచ్చని ఆర్‌సెక్యూరిటీస్‌ ప్రతినిధి నవీన్‌ కులకర్ణి అభిప్రాయపడ్డారు. అన్ని మార్కెట్లలో ప్రస్తుతం లిక్విడిటీ సమస్య కనిపిస్తోందని, ఈక్విటీల్లో మరికొంత కాలం ఈ అనిశ్చిత పరిస్థితులు ఉండొచ్చని చెప్పారు. ఇప్పుడున్న మార్కెట్లో మిడ్‌క్యాప్‌ ఐటీ, బ్యాంకింగ్‌రంగాలు ఆకర్షణీయంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎర్నింగ్స్‌లో స్వల్ప ఆటుపోట్లు తప్ప మిడ్‌క్యాప్‌ ఐటీ విభాగం బాగానే

Most from this category