News


12350 పాయింట్ల వరకు నిఫ్టీ!

Wednesday 18th December 2019
Markets_main1576646342.png-30283

12070 పైన బలంగా ఉంటేనే...
నిఫ్టీ చార్టుల్లో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 12070 పాయింట్ల పైన బలంగా ఉన్నంత వరకు 12290 - 12350 పాయింట్లను చేరే అవకాశాలు అధికమని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం, ట్రంప్‌ అభిశంసన సమావేశాల నేపథ్యంలో స్వల్పకాలానికి నిఫ్టీ పరిమిత కదలికలు చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు. లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయవచ్చని, కొంత వెనుకంజ వేసిన తర్వాత తిరిగి లాంగ్స్‌ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. నిఫ్టీ 12070 పాయింట్ల దిగువకు వస్తే మాత్రం బలహీనత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందరి కళ్లూ బుధవారం జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంపై ఉన్నాయి. జీఎస్‌టీ బేస్‌ రేటును పెంచే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల టార్గెట్‌ చేరుకోవాలంటే నవంబర్‌- ఫిబ్రవరి నెలల్లో నెలనెలా 1.1 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూళ్లు రావాల్సిఉంటుందని అంచనా. ఇందుకోసం శ్లాబులు సవరించవచ్చని భావిస్తున్నారు. 
నిఫ్టీకి కీలక స్థాయిలు: 12070, 12200.
యస్‌ సెక్యూరిటీస్‌ షార్ట్‌ టర్మ్‌కు కొన్ని షేర్లను రికమండ్‌ చేస్తోంది..
1. కోల్గేట్‌ పామోలివ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1650. స్టాప్‌లాస్‌ రూ. 1430.
2. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 305. స్టాప్‌లాస్‌ రూ. 267. 
3. హెచ్‌సీఎల్‌ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 557. స్టాప్‌లాస్‌ రూ. 540. 



You may be interested

స్థిరంగా పసిడి

Wednesday 18th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,481 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై మిశ్రమ స్పందన, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ మారక విలువ వారం గరిష్టాన్ని అందుకోవడం తదితర కారణాలు పసిడి స్థిరమైన ర్యాలీకి దోహదపడుతున్నాయి. ట్రేడ్‌ డీల్‌ ఒప్పందం నేపథ్యంలో

కార్వీ కేసులో సెబీకి శాట్ ఆదేశాలు

Wednesday 18th December 2019

న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ వివాదంలో యాక్సిస్ బ్యాంకు అభ్యర్ధనపై 15 రోజుల్లోగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఆదేశించింది. వివరాల్లోకి వెడితే.. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  తనఖా పెట్టిన షేర్లకు ప్రతిగా కార్వీకి యాక్సిస్ బ్యాంకు రూ. 81 కోట్ల రుణం ఇచ్చింది. అయితే, తనఖా షేర్లను క్లయింట్లకు బదలాయించేయాలంటూ సెబీ

Most from this category