News


12050పైన క్లోజయితే ఆల్‌టైమ్‌ హై పక్కా!

Monday 25th November 2019
Markets_main1574674277.png-29840

నిఫ్టీపై నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్‌ గతవారం ఒడిదుడకుల పయనం నుంచి ఈ వారం గాడిలో పడింది. సోమవారం చిన్నపాటి లాభంతో ఆరంభమైన నిఫ్టీ మధ్యాహ్న సమయానికి దాదాపు 140 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. దీంతో మరోమారు నిఫ్టీ కీలక 12వేల పాయింట్ల పైకి చేరింది. గత నిరోధం 12038 పాయింట్లను దాటి 12050 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. దీంతో నిఫ్టీ పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించినట్లే కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ సోమవారం ముగింపు సమయానికి 12050 పాయింట్లపైన బలంగా ఉంటే తదుపరి కొన్ని సెషన్లలో మరో జీవితకాల గరిష్ఠం చూస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ దఫా నిఫ్టీ కదలికలు 12200- 12300 పాయింట్ల వరకు ఉండే ఛాన్సులున్నాయి. ఈ స్థాయిని నిలబెట్టుకోలేక దిగువకు వస్తే మరలా రేంజ్‌ బౌండ్‌ కదలికలే ఉంటాయి. రాబోయే రోజుల్లో నిఫ్టీకి 11800 పాయింట్లు అతిపెద్ద మద్దతుగా ఉంటంది. దీన్ని కోల్పోతే క్రమంగా 11600 పాయింట్ల వరకు దిగజారవచ్చు. 12వేల పాయింట్ల వద్ద కాల్స్‌, పుట్స్‌ అధికంగా ఉన్నాయి. కానీ పుట్‌ రైటింగ్‌ ఎక్కువగా జరిగినందున పతనానికి ఛాన్సులు తక్కువగా కనిపిస్తున్నాయి. 
బ్యాంకు నిఫ్టీ: బ్యాంకు నిఫ్టీ 31000 పాయింట్ల పైన గతవారాన్ని ముగించింది. ఈ పాజిటివ్‌నెస్‌ సోమవారం కొనసాగింది. ప్రస్తుతం బ్యాంకు నిఫ్టీ 31500 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. 30800 పాయింట్ల పైన సూచీ కదిలినంత కాలం అప్‌మూవ్‌కే అవకాశాలెక్కువ. 31700 పాయింట్ల వద్ద బ్యాంకు నిఫ్టీకి తదుపరి నిరోధం ఎదురవుతుంది.
అనలిస్టుల మిడ్‌ టర్మ్‌ సిఫార్సులు:
1. టీవీఎస్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 505. స్టాప్‌లాస్‌ రూ. 385.
2. టాటాస్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 438. స్టాప్‌లాస్‌ రూ. 355.
3. మారుతీ సుజుకీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 7700. స్టాప్‌లాస్‌ రూ. 6650.



You may be interested

సెన్సెక్స్‌ కొత్త రికార్డు...చేరువలో నిఫ్టీ

Monday 25th November 2019

164 పాయింట్లు పెరిగి నిఫ్టీ కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూలాంశాలు  రాణించిన బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సోమవారం సూచీలు పరుగులు తీసాయి. సెన్సెక్స్‌ 529 పాయింట్లు పెరిగి 40,889 వద్ద క్లోజయ్యింది. ఇది సెన్సెక్స్‌కు రికార్డు ముగింపు. ఇక నిఫ్టీ 164.60 పాయింట్ల లాభంతో 12,079 వద్ద క్లోజయ్యింది. జూన్‌ తొలివారంలో నమోదైన రికార్డు గరిష్ఠాన్ని కొద్దిరోజుల క్రితమే దాటిన సెన్సెక్స్‌ తాజాగా 40,900 పాయింట్లపైన మరో

జీవిత బీమా తీసుకుంటున్నారా? అయితే ఇంకో వారం ఆగండి!

Monday 25th November 2019

కొత్తగా జీవిత బీమా పాలసీలను ఈ నెల 30 లోపు తీసుకోమని ఎజెంట్లు తొందర పెడుతున్నారా? అయితే ఆచితూచి అడుగేయాల్సిందే. ఎందుకంటే జీవిత బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ (ఇన్సురెన్స్‌ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) కొత్త మార్గదర్శకాలు డిసెంబర్‌ 1 వ తేది నుంచి అమలులోకి రానున్నాయి. అందుకే జీవిత బీమా పంపిణిదారులు పాలసీలు తీసుకోమని వినియోగదారులను తొందరపెడుతున్నారని పరిశీలకులు తెలిపారు. ‘కొత్త ప్లాన్‌లలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా

Most from this category