News


డిసెంబర్‌కల్లా 10,300 స్థాయికి నిఫ్టీ!

Saturday 3rd August 2019
Markets_main1564823437.png-27525

  • కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులలో 1 శాతం రిస్క్‌ మాత్రమే తీసుకోండి

మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బేర్‌ మార్కెట్లో కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాయని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

12,000 మార్కు ఇక కలే!
 బడ్జెట్‌ తర్వాత నుంచి మార్కెట్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటి వరకు బీఎస్‌ఈలో ఏకంగా రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ముందుకు వెళ్లే కొద్ది కూడా మార్కెట్లు గణనీయంగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఏదేమైనా, రాబోయే కొద్ది వారాల్లో షార్ట్ కవరింగ్ ఉంటుంది. అయినప్పటికి వచ్చే బడ్జెట్ వరకు డౌన్‌వార్డ్‌ ధోరణి ఉండే అవకాశం ఉంది. ఒక సంవత్సరం హోరిజోన్ కాలంలో నిఫ్టీ 12,000 మార్కును తిరిగి స్వాధీనం చేసుకోవడం కలే!

ఎల్లప్పుడు స్టాప్‌ లాస్‌ను పెట్టుకోవడం..
స్మాల్ క్యాప్‌, మిడ్‌క్యాప్స్ సెక్టార్‌ అధికంగా నష్టపోతున్నాయి. ఎస్ అండ్ పి బిఎస్ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ తన రికార్డ్‌ స్థాయి నుంచి 20 శాతానికి పైగా, ఎస్ అండ్‌ పి బిఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రికార్డు స్థాయి నుంచి 27 శాతానికి పైగా పడిపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు బేర్‌ మార్కెట్లో ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది నుంచి ఈ సెక్టార్‌ షేర్లు కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత సమయంలో ఈ స్టాక్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది కాదు. ఈ స్టాకులు ఇంకా దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో గరిష్ట నష్టాలు జరగే అవకాశం ఉంది. కాబట్టి బాగా పడిపోయాయని భావించి పెద్ద మొత్తంలో షేర్లను కొనొద్దని ఇన్వెస్టర్లకు మా సలహా.

ఎక్కువ రిస్కు వద్దు!

కఠిన సమయాలలో మార్కెట్లను అంచనావేయడం కష్టం కాబట్టి  కొత్తగా ఇన్వెస్ట్‌ చేసే వాళ్లు మీ పెట్టుబడిలో 1 శాతం కన్నా ఎక్కువగా రిస్క్‌ తీసుకొవద్దు. దీంతోపాటు పడిపోతున్న షేర్ల బాటమ్‌లను ఊహించడం కష్టం, కేవలం ధరలు పడిపోతున్నాయి కాబట్టి షేర్లను కొనుగోలు చేయవద్దు. నాణ్యమైన కంపెనీలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయలనుకుంటే ముందుగా ఆ కంపెనీలు పాజిటివ్‌ సంకేతాన్ని ఇచ్చేంత వరకు వేచి చూడండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎల్లప్పుడు స్టాప్‌ లాస్‌ను పెట్టుకోవడం మరిచిపోవద్దు.   దేశియ మార్కెట్‌ సూచీలు ఇంకా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా నిఫ్టీ 10,300-10,000 స్థాయిని పడిపోవచ్చు. కొంత షార్ట్‌ కవరింగ్‌ కారణంగా మార్కెట్లు బౌన్స్‌ అయ్యే అవకాశం ఉన్నప్పటికి మార్కెట్‌ ట్రెండ్‌ మాత్రం డౌన్‌ వార్డ్‌గానే ఉంది. 

200 డిఎంఎ.. స్టాకులు వద్దు
300 కి పైగా స్టాక్స్ 200-డిఎంఎ కన్నా దిగువన ట్రేడవుతున్నాయి. వీటిలో ఎంఆర్‌ఎఫ్, 3 ఎమ్ ఇండియా, మారుతి, డాక్టర్ రెడ్డి, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఎన్‌ఐఐటి టెక్, ఆర్‌ఐఎల్, లుపిన్ వంటి పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. కంపెనీల షేర్లు 200-డిఎంఎ కన్నా దిగువన ట్రేడవుతుంటే వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం సరైన విధానం కాదు. పెట్టుబడిదారులు కొనుగోలు చేయడానికి ముందు ఇతర గుణాత్మక అంశాలను కూడా పరిశీలించాలి. ఇలాంటి పరిస్థితులలో ఏదైనా స్టాకులో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే ఇన్వెస్టర్లు భద్రత మార్జిన్‌కు అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి.  తక్కువ వాల్యుయేషన్ మల్టిపల్స్‌ వద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ఖచ్చితంగా సరైన చర్యే. వీటితోపాటు గత కొన్ని సంవత్సరాల నుంచి అధిక వాల్యుషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాకులు, క్రమంగా పెరుగుతూ వస్తున్న స్టాకులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.You may be interested

ఎన్‌పీఎస్‌ ఇన్వెస్టర్లూ ఇది విన్నారా...?

Sunday 4th August 2019

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఆగస్ట్‌ 1 నుంచి పరిపాలనా రుసుం తిరిగి అమల్లోకి వచ్చింది. ఇన్వెస్టర్‌ పెట్టుబడుల విలువపై వార్షికంగా 0.005 శాతాన్ని అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీ కింద ఎన్‌పీఎస్‌ ఫండ్స్‌ మేనేజర్లు ఇకపై రాబట్టుకుంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులను కొంత మేర ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.    ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ జనరల్‌ మేనేజర్‌ అఖిలేశ్‌ కుమార్‌ చందాదారులకు

స్పందన స్ఫూర్తి రూ.360కోట్ల నిధుల సమీకరణ

Saturday 3rd August 2019

యాంక‌ర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపుల ద్వారా రూ.360.28 కోట్లను స‌మీక‌రించిన‌ట్లు స్పందన స్ఫూర్తి కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 42లక్షల ఈక్విటీ షేర్లను అప్పర్‌ ప్రైజ్‌ బాండ్‌ రూ.856 వద్ద కేటాయింపు ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. వెల్స్‌ ఫార్గో ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్వటీ ఫండ్స్‌, ఫ్లోరిడా రిటైర్‌మెంట్‌ సిస్టమ్స్‌, బజాజ్‌ అలియన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సహా మరో 15 యాంకర్‌ ఇన్వెస్టింగ్‌

Most from this category