News


11100 పాయింట్ల వరకు నిఫ్టీ పతనం!

Thursday 27th February 2020
Markets_main1582782682.png-32133

గౌతమ్‌ షా అంచనా
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు చాలా బలహీనంగా ఉన్నాయని, ఇదే ధోరణి కొనసాగితే నిఫ్టీ 11300 పాయింట్లకు అక్కడ నుంచి 11100 పాయింట్లకు దిగజారవచ్చని మార్కెట్‌ అనలిస్టు గౌతమ్‌ షా చెప్పారు. ప్రస్తుత బలహీనతకు ఆరునెలల కిందటే బీజాలు పడ్డాయన్నారు. ప్రస్తుతం చార్టులు, ఇండికేటర్లు అన్నీ నెగిటివ్‌ సంకేతాలనే ఇస్తున్నాయన్నారు. నిజానికి నిఫ్టీలో బలం లేకున్నా కొన్ని స్టాకుల మద్దతుతో 12400 పాయింట్లను తాకిందన్నారు. గతవారం ఆరంభమైన పతనం ఏదో మామూలు పతనం కాదని, స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌కు ఆరంభమని అభిప్రాయపడ్డారు. ఇకపై నిఫ్టీలో లోయర్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పడతాయని అంచనా వేశారు. ఇది కొన్ని నెలలపాటు కొనసాగవచ్చన్నారు. ప్రస్తుత పతన ఉధృతి, వాల్యూంలు చూస్తే ఇప్పట్లో సూచీలు కోలుకొని ర్యాలీ బాట పట్టే ఛాన్సులు తక్కువని చెప్పారు. మార్కెట్లో పెద్ద మార్పు వస్తోందని, ఇందుకు అంతర్జాతీయ మార్కెట్లలో పతనం తోడయ్యిందని తెలిపారు.

మార్కెట్‌ పుంజుకునే ముందు మరింత పతనం కావడం తప్పదని చెప్పారు. ఇందుకు నిదర్శనంగా బడ్జెట్‌ రోజు కనిష్ఠం 11620 పాయింట్ల స్థాయిని కోల్పోవడమని సూచించారు. ఇకపై మార్కెట్‌ మరింత దిగజారుతూ 11300 పాయింట్లకు ఇంకా చెప్పాలంటే 11100 పాయింట్లకు దిగిరావచ్చన్నారు. ఇప్పటికైతే 11900 పాయింట్ల వద్ద నిఫ్టీ అప్‌సైడ్‌కు బలమైన నిరోధం ఉందన్నారు. ప్రస్తుత పతనంలో అనేక రంగాల షేర్లు పాలుపంచుకుంటున్నాయని, బ్యాంకు నిఫ్టీ మాత్రమే కొంతమేర నిఫ్టీని ఆదుకుంటోందని తెలిపారు. ఇకపై బ్యాంకు నిఫ్టీలో పతనం వస్తే ఆశ్చర్యం లేదన్నారు. గత ఏడాది ఏడాదిన్నరగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు మాత్రమే బ్యాంకు నిఫ్టీని నిలబెడుతోందని చెప్పారు. ఇది రివర్సయిన రోజు బ్యాంకు నిఫ్టీ క్రమంగా 29700 పాయింట్ల వరకు దిగిరావచ్చని, అంతకు దిగువన 28900 పాయిం‍ట్లను చేరినా చేరవచ్చని చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు సహా కీలక బ్యాంకు షేర్లు బలహీనంగా ఉన్నందున బ్యాంకు నిఫ్టీలో 2000 పాయింట్ల పతనం వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇప్పట్లో బాటమ్‌ అవుట్‌ అయ్యే సూచనల్లేవన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ రంగానికి దూరంగా ఉండాలని, కొత్త పొజిషన్ల జోలికి పోవద్దని అనలిస్టులకు సూచించారు. 



You may be interested

ఇండియా సిమెంట్స్‌లో 12 శాతానికి పెరిగిన దమానీల వాటా

Thursday 27th February 2020

పెరిగిన రాధాకిషన్‌, గోపీకిషన్‌ దమానీ వాటా   దక్షిణాది కంపెనీ ఇండియా సిమెం‍ట్స్‌లో తాజాగా డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ కుటుంబ సభ్యులు​వాటాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల ద్వారా ఈ నెల 25, 26లలో రాధాకిషన్‌​దమానీ  కుటుంబ సభ్యులు మొత్తం 2.25 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరుకి రూ. 104.16 ధరలో కొనుగోలు చేసిన ఈ వాటా ఇండియా సిమెం‍ట్స్‌

మార్చి నెలకు నిఫ్టీ షార్ట్‌ రోలోవర్స్‌!

Thursday 27th February 2020

మార్చి నిఫ్టీ ఫ్యూచర్స్‌ బుధవారం ఫిబ్రవరి నిఫ్టీ ఫ్యూచర్స్‌ కన్నా డిస్కౌంట్‌లో ట్రేడయ్యాయి. చాలా మంది ట్రేడర్లు ఫిబ్రవరి షార్ట్‌ పొజిషన్లను మార్చికి రోలోవర్‌ చేసుకోవడంతో పాటు పలు కొత్త షార్ట్స్‌ పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ మార్కెట్లన్నీ భయం నీడలో నడుస్తున్నాయి. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మార్చి నిఫ్టీ ఫ్యూచర్స్‌ 11573 పాయింట్ల వద్ద, స్పాట్‌ నిఫ్టీ 11565 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Most from this category