News


నిఫ్టీలో మరింత పతనానికి ఛాన్స్‌?!

Tuesday 18th June 2019
Markets_main1560845530.png-26384

గత మూడు వారాల కనిష్ఠ స్థాయి 11,769ని బ్రేక్‌ చేస్తూ నిఫ్టీ ఈ వారం 1.25శాతం నష్టంతో 11,672 వద్ద మొదలైంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11,450-11,500 వద్ద మద్దతు లభించనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిఫ్టీ 11,655 వద్ద 20 రోజుల ఎక్స్‌పోనెన్సియల్‌ మూవింగ్‌ ఏవరేజి(ఈఎమ్‌ఏ)ని దాటేసిందని, ఇప్పుడు 50రోజుల ఈఎమ్‌ఏ కి చేరువలో ఉందని నిపుణులంటున్నారు. మే 20న వెలువడిన ఎక్సిట్‌ పోల్స్‌ తరువాత నిఫ్టీ 11,426 నుంచి 11,591 కు ఎగబాకింది. ఆ సమయంలో ఏర్పడిన గ్యాప్‌ నిప్టీకి షార్ట్‌ టెర్మ్‌ మద్ధతుగా ఉండగలదు. నిఫ్టీ బ్యాంక్‌ 31,600 డబుల్‌ బాట్‌మ్‌ సపోర్ట్‌ను కోల్పోయిందని ఇది కూడా నిఫ్టీలో అమ్మకాలకు కారణం కావొచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ బ్యాంక్‌కు 29,700-29,900 పరిధిలో మద్దతు లభించే అవకాశం ఉంది. ఎమ్‌ఏసీడీ సూచీలు, ఆర్‌ఎస్‌ఐ కదలికలు ప్రతి రోజు సూచీల్లో నష్టాలనే నమోదు చేస్తున్నాయి. ఇవన్ని మార్కెట్‌లు నష్టాల వైపు పయనిస్తున్న విషయాన్ని వివరిస్తున్నాయి. అంతే కాకుండా నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ల సూచీలు కూడా వాటి ప్రభావాన్ని కోల్పోయి రెండు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. 
     బీఎస్‌ఈ అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేసియో(ఏడీఆర్‌) గత 13 సెషన్‌లు నెగిటివ్‌లోనే ఉంది. ఇది మార్కెట్‌ బలహీనతను వివరిస్తోందని పరిశీలకులంటున్నారు. లార్జ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ల వ్యత్యాసం పెరిగిందని, డెరివేటివ్‌ల పరంగా చూస్తే నిఫ్టీ 11,500 వద్ద ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లు(ఓఐ) అధికంగా వచ్చాయని ఇవి నిఫ్టీని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరిస్తాయని తెలిపారు. కానీ 11,800 వద్ద మాత్రం నిఫ్టీ తిరోగమనం పొందవచ్చని. నిఫ్టీ 11,800 కన్నా పై స్థాయికి చేరలేకపోతే షార్ట్‌ టెర్మ్‌లో నష్టాలకు అవకాశం ఉందని వివరించారు. సాంకేతిక ఆధారాలననుసరించి నిఫ్టీ షార్ట్‌టెర్మ్‌లో 11,450-11,500 స్థాయి వరకు పతనం చెందవచ్చు అని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.You may be interested

ఐఐఎఫ్‌ఎల్‌ నుంచి 3 మల్టీ బ్యాగర్లు

Tuesday 18th June 2019

వచ్చే నెలలో మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్‌కు కీలకం కానునందని ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వినియమ, అటో రంగాలకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నందున ఈ రంగాలకు చెందిన షేర్లు పోర్ట్‌ఫోలియోలో చేరుకోవచ్చని భాసిన్‌ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనీకంట్రో‍ల్‌ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.  పలు దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధాలకు

210 షేర్లు ఏడాది కనిష్టానికి ...

Tuesday 18th June 2019

మార్కెట్లో మిడ్‌సెషన్‌ సమయానికి ఆరంభలాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి స్థిరమైన ర్యాలీ దేశీయ మార్కెట్‌కు అండగా నిలుస్తున్నాయి. మధ్యాహ్నం గం.1:00ని.లకు సెన్సెక్స్‌ 185 పాయింట్లు పెరిగి 39,145.09 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లను ఆర్జించి 11,723.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌ రంగ

Most from this category