News


11,200 వరకు పతనం..!

Thursday 25th July 2019
Markets_main1563993367.png-27291

నిఫ్టీ బుధవారం 11,300కు దిగువన క్లోజయింది. నిజానికి 11,300 అన్నది కీలకమైన మద్దతు స్థాయి. 200 రోజుల ఎక్స్‌పొనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ అక్కడే ఉంది. దీనిని కోల్పోవడంతో రానున్న సెషన్లలో నిఫ్టీ ఇంకా నష్టపోవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

 

‘‘స్వల్ప కాలిక ఆసిల్లేటర్స్‌ అమ్మకాల ఒరవడిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇండెక్స్‌ తన మద్దతు స్థాయి అయిన 11,130-11,260 శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చు’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. నిఫ్టీ-50 11,297 దిగువన కొనసాగినంత కాలం ఈ ఏడాది మే నెలలో నమోదైన కనిష్ట స్థాయి 11,108ని పరీక్షించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌కు చెందిన మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. ప్రస్తుత నిఫ్టీ 50 పూర్తి అప్‌మూవ్‌ ఈ స్థాయి నుంచే ఆరంభమైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత పతనం ఈ స్థాయి కంటే దిగువకు వెళ్లొచ్చన్న అంచనా వ్యక్తం చేశారు. 

 

‘‘బుధవారం నిఫ్టీ-50 11,271 వద్ద క్లోజ్‌ అయింది. డైలీ చార్ట్‌లో కనిష్టంలో కనిష్టం, కనిష్టంలో గరిష్టంతో బేరిష్‌ క్యాండిల్‌ను నమోదు చేసింది. 11,320 దిగువన ఉన్నంత వరకు నిఫ్టీ తక్షణ గమనం బలహీనంగానే ఉంటుంది. అంతేకాదు ఈ బలహీనత 11,200 వరకు దారితీవయచ్చు. ఎగువవైపున 11,365 కీలక అవరోధం అవుతుంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన చందన్‌ తపారియా తెలిపారు. ఇండెక్స్‌ 11,250 స్థాయిలో హార్మోనిక్‌ బుల్లిష్‌ బ్యాట్‌ సంకేతం ఇచ్చినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ రోహిత్‌ సింగ్రే వివరించారు. దీనికి పైన ఇండెక్స్‌ నిలదొక్కుకుంటే తదుపరి 11,350-11,400 వరకు రానున్న సెషన్లలో పెరిగేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులో తెలుగు ఇన్వెస్టర్లు ఎక్కడ...?

Thursday 25th July 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తులు జూన్‌లో 9.52 శాతం పెరిగి రూ.25.81 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల వాటా 42.3 శాతం. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల్లో 41.8 శాతం వాటాతో మహారాష్ట్ర మరే రాష్ట్రానికీ అందనంత దూరంలో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ 8.9

ఫలితాల ఎఫెక్ట్‌: మహింద్రా ఫైనాన్స్‌ 10 శాతం డౌన్‌

Wednesday 24th July 2019

జూన్‌ త్రైమాసిక ఫలితాలలో మహింద్రా అండ్‌ మహింద్రా నికర లాభం 66 శాతం పడిపోవడంతో మహింద్రా ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో 10.52 శాతం నష్టపోయి రూ. 304.45 వద్ద ముగిసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.322 కోట్ల నికర లాభం నమోదవ్వగా ఈ త్రైమాసికంలో అది రూ.108 కోట్లకు పడిపోయింది. మహింద్రా ఫైనాన్స్‌ షేరు విలువ గత సెషన్‌లో రూ.340.15 వద్ద ముగియగా బుధవారం

Most from this category