News


అకస్మాత్తుగా అమ్మకాలు: నిఫ్టీ 110 పాయింట్లు క్రాష్‌

Tuesday 30th July 2019
Markets_main1564479627.png-27414

మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో నెలకొన్న అనూహ్య అమ్మకాలతో సూచీలు భారీ నష్టాన్ని చవిచూసాయి. నిఫ్టీ ఇండెక్స్‌ తనకు కీలకమైన 200డీఎంఏ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమై ఆ స్థాయికి కిందకు పతనమవడంతో అమ్మకాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ బ్యాంకు షేర్లు భారీ నష్టాల్ని చవిచూసాయి.  ఫలితంగా మార్చి 11 తరువాత నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారి 11100 స్థాయిని కోల్పోయింది. ఒకదశలో ఏకంగా 110 పాయింట్లు నష్టపోయి 11,078.70 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకింది. మరో ప్రధాన సూచీ సెన్సెక్స్‌ సైతం 333 పాయింట్లు క్షీణించి 37,363.71 వద్దకు పతనమైంది. ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ నేడు 11050 స్థాయి నిలబెట్టుకోగలిగతే 11010 స్థాయి వద్ద కీలకమైన మద్దతు ధర లభిస్తుం‍దని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం గం:2:50ని.లకు నిఫ్టీ 94 పాయింట్లను నష్టపోయి 11,095 వద్ద, సెన్సెక్స్‌ 257 పాయింట్లను కోల్పోయి 37,429.37 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇదే సమయానికి నిఫ్టీ-50 సూచీలో ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌, హీరోమోటోకార్ప్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 4.50శాతం నుంచి 7.50శాతం నష్టంతో టాప్‌-5 లూజర్లుగా కొనసాగుతున్నాయి. 



You may be interested

ఏడాది కనిష్టానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు

Tuesday 30th July 2019

తొలి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రంగా నమోదుకావడంతో బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏడాది కనిష్టాని పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.75.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయంలో బ్యాంకు ఈ క్యూ1 ఫలితాలను నమోదు చేసింది. ఫలితాలు మార్కెట్‌ మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో షేరు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనై 7శాతం నష్టపోయి రూ.70.30ల వద్ద ఏడాది కనిష్టానికి

యుఎస్‌ సూచీ లక్ష్యాన్ని పెంచిన గోల్డ్‌మాన్‌శాక్స్‌

Tuesday 30th July 2019

యుఎస్‌ బెంచ్‌మార్క్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 2019 టార్గెట్‌ను 3 శాతం పెంచి 3,100 పాయింట్లుగా నిర్ణయించినట్టు ప్రముఖ గోల్డ్‌మాన్ శాక్స్‌ మంగళవారం తెలిపింది. ఇది ఈ ఏడాది 24 శాతం లాభాలను సూచిస్తుంది. కానీ ఆర్థిక కార్యకలాపాలు, మార్జిన్ దృక్పథంలో బలహీనత వలన ఆదాయ అంచనాలను తగ్గించింది. ఈ వారం ఫెడరల్ రిజర్వ్ నుంచి ఊహించినట్టే రేటు తగ్గింపు ఉంటుందనే వార్తల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ ఇంట్రాడే గరిష్ఠమైన

Most from this category