News


తాజా బౌన్స్‌తో మారేదేమీ లేదు!

Monday 12th August 2019
Markets_main1565591923.png-27710

మధ్యకాలిక డౌన్‌ట్రెండ్‌ కొనసాగుతుంది
మార్కెట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
మార్కెట్లలో కనిపిస్తున్న తాజా అప్‌మూవ్‌తో స్వల్పకాలిక నెగిటివ్‌ అవుట్‌లుక్‌ ఏమీ మారదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నాగరాజ్‌ షెట్టి చెప్పారు. గురువారం అప్‌మూవ్‌కు కొనసాగింపుగా శుక్రవారం కూడా నిఫ్టీ, సెన్సెక్స్‌ మంచి జోరే చూపాయి. కానీ శుక్రవారం నిఫ్టీ తన కీలక నిరోధం 11115 స్థాయికి పైన ముగియడంలో విఫలమైందని షెట్టి చెప్పారు. ఇంట్రాడేలో ఈ నిరోధాన్ని దాటినా, చివరకు ఆ స్థాయి దిగువనే క్లోజయిందన్నారు. వీక్లీ చార్టుల్లో పెద్ద బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడిందని, దిగువ స్థాయిల్లో కొనుగోళ్లను ఇది సూచిస్తోందని చెప్పారు. అయితే దీనివల్ల మార్కెట్‌ స్వల్పకాలిక నెగిటివ్‌ ధృక్పథంలో ఏమీ మార్పు రాలేదన్నారు. ఇక్కడ నుంచి ఒకవేళ మరింత ముందుకు వెళ్లినట్లయితే రెండు మూడు వారాల్లో 11450- 11500 పాయింట్ల వరకు నిఫ్టీ చేరవచ్చన్నారు. ఈ స్థాయికి వచ్చాక అప్‌బౌన్స్‌ ముగిసి మరో కొత్త కరెక‌్షన్‌ ఆరంభమయ్యేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. ఈదఫా పతనంలో 10000 పాయింట్ల వరకు నిఫ్టీ రావచ్చని, ఇందుకు 3-4 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. తాజా అప్‌మూవ్‌లో 11185 పాయింట్ల వద్ద నిఫ్టీ స్వల్ప నిరోధం ఎదుర్కొంటుందని, ఈ వారంలో దీన్ని దాటవచ్చని అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు మార్కెట్‌ కదలికలను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 
- షార్ట్‌టర్మ్‌కు మహీంద్రాఫైనాన్స్‌(టార్గెట్‌ రూ. 299), బజాజ్‌ ఫైనాన్స్‌(టార్గెట్‌ రూ. 3750) షేర్లను రికమండ్‌ చేశారు.You may be interested

నష్టాలొస్తున్నాయి... సిప్‌లు ఆపేయాలా ?

Monday 12th August 2019

ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వాల్యూ రీసెర్చ్) ప్ర: నేను 2017 నుంచి కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో సుందరమ్‌ రూరల్‌ అండ్‌ కంజప్షన్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌–క్యాప్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్, ఎల్‌ అండ్‌ టీ ఇండియా వేల్యూ ఫండ్, టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌లు ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో 2017 నుంచి సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లు ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్‌ నష్టాలు చూపడంతో 2018లో సిప్‌లు

ఈ రెండు షేర్లను కొనొచ్చు

Monday 12th August 2019

మారుతీ సుజుకీ    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.6,101 టార్గెట్‌ ధర: రూ. 6,950 ఎందుకంటే:-  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమ్మకాలు సాధారణ స్థాయికి వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీని కోసం ఉత్పత్తి సామర్థ్యం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పెంపు కోసం సేల్స్‌, సర్వీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేస్తోంది. విద్యుత్‌ వాహనాలు, హైబ్రిడ్‌ వాహనాల కోసం టెక్నాలజీ నిమిత్తం టయోటా కంపెనీతో మారుతీ సుజుకీ కుదుర్చుకున్న ఒప్పందం సానుకూల ప్రభావం

Most from this category