News


సెన్సెక్స్‌ 2700 పాయింట్లు క్రాష్‌..!

Monday 23rd March 2020
Markets_main1584936831.png-32626

కరోనా వ్యాధి భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను వీడటం లేదు. దీంతో సోమవారం సైతం ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 27వేల మార్కును, నిఫ్టీ నిఫ్టీ 8వేల స్థాయిని కోల్పోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి సరికొత్త కనిష్ట స్థాయికి పతనమైంది. శుక్రవారం ముగింపు స్థాయి(75.19)తో పోలిస్తే 50 పైసలు బలహీనపడి 75.69 వద్ద ప్రారంభమైంది. 

కరోనా వైరస్‌ విస్తరించకుండా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నట్లు గుర్తించిన 17రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 వరకు ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్ర ప్రకటించింది. ఇప్పటికి వరకు దేశవ్యాప్తంగా సుమారు 400 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 

కరోనా భయాలతో నేడు సెన్సెక్స్‌ సూచీ 2,624.69(8.77శాతం) పాయింట్ల నష్టంతో 27291.27 వద్ద, నిఫ్టీ 757.05(8.66శాతం) పాయింట్లను కోల్పోయి 7988.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని ప్రధాన ఇండెక్స్‌లన్నీ దాదాపు 8శాతానికి పైగా నష్టపోయాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు పతనమవుతున్నాయి. 

ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికోస్తే.. ఆసియాలో దేశాలకు చెందిన స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ప్రధాన దేశాల మార్కెట్ల సూచీలన్నీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

నిఫ్టీ -50 సూచీలో ఏ ఒక్క షేరు సైతం లాభాల్లో ట్రేడ్‌ కావడం లేదు. బజాజ్‌ ఫైనాన్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, శ్రీరాం సిమెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేరు 13శాతం నుంచి 14.50శాతం నష్టపోయాయి. 



You may be interested

నేటివార్తల్లోని షేర్లు

Monday 23rd March 2020

 వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, హీరో మోటోకార్ప్‌: ఈ మూడు కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్న వాహన తయారీ ప్లాంట్లను నిలిపివేసాయి.  దాల్మియా భారత్‌: దాల్మియా భారత్‌  తన ఈక్విటీ షేర్లను రూ.500 కోట్లవరకు తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో యూనిట్‌ గరిష్టంగా రూ.700ల చొప్పున 71,42,857 షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్కార్ట్స్‌: దేశీయ ట్రాక్టర్‌

బంగారం... 1,300 డాలర్లకు వచ్చే అవకాశం!

Monday 23rd March 2020

అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి ‍కోవిడ్‌-19(కరోనా) వైరస్‌  ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌-నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర ఈ నెల మొదట్లో పసిడి ఎనిమిది సంవత్సరాల గరిష్టం 1,704 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావించే ఈ మెటల్‌ నుంచి కూడా డబ్బును ఇన్వెస్టర్లు ఉపసంహరించి డాలర్‌లోకి పంప్‌

Most from this category