News


12100 దిగువన నిఫ్టీ ప్రారంభం

Thursday 30th January 2020
Markets_main1580356718.png-31319

అంతర్జాతీయ మార్కెట్లను బలహీన సంకేతాలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 134 పాయింట్లను కోల్పోయి 41,064.09 వద్ద, నిఫ్టీ 32.45పాయింట్ల నష్టంతో 12100 దిగువన 12,097.05 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క రియల్టీ, అటో షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలక బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టంతో 30727 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిన్నరాత్రి వడ్డీరేట్లపై తన వైఖరిని ప్రకటించింది. మార్కెట్‌ వర్గాలు ఊహించినట్లుగానే యధాతథ పాలసీకే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. దీంతో రాత్రి అక్కడి మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో నేడు ఆసియా ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక వృధి భయాలతో క్రూడాయిల్‌ ధరలు మరింత దిగివచ్చాయి. 

నేడు జనవరి సీరిస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్త, డాలర్‌ మారకంలో రూపాయి విలువ మునపటి ముగింపు(71.25)తో పోలిస్తే 16 పైసలు బలహీనపడి 71.41డాలర్ల వద్ద బలహీనంగా ప్రారంభం కావడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 

ఇదే సమయానికి నిఫ్టీ -50 ఇండెక్స్‌లో... హిందాల్కో, ఇండస్‌ ఇండ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బీపీసీఎల్‌, ఐషర్‌ మోటర్స్‌, ఎన్‌టీపీసీ, ఐఓసీ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. 



You may be interested

మార్కెట్లోకి మెర్సిడెస్‌ కొత్త ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ’

Thursday 30th January 2020

ధరల శ్రేణి రూ. 73.70 లక్షలు –  1.25 కోట్లు ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా’ తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని లాంగ్‌ వీల్‌ బేస్‌ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్‌ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 300 డీ’ ధర రూ. 73.70 లక్షలు కాగా.. హిప్‌-హాప్‌ వేరియంట్‌గా కంపెనీ వ్యవహరిస్తున్న ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 400 డీ’ ధర రూ. 1.25

ఎల్‌టీసీజీ రద్దుకు బీజేపీ మద్దతు

Thursday 30th January 2020

దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ నిధుల వరద పెంచేందుకు మార్కెట్‌వర్గాలు కోరుతున్న పన్ను సవరణలు తీసుకురావాలని భారతీయ జనతాపార్టీ తమ ప్రభుత్వాన్ని కోరింది. ఈక్విటీ మార్కెట్‌ రిటర్న్స్‌పై పన్ను నిబంధనల సవరణలు తీసుకురావాలని పార్టీ సీనియర్‌ నాయకులు కోరారు. ఈక్విటీ పెట్టుబడులు, రాబడులపై ఎల్‌టీసీజీ(దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను)ను ఎత్తివేయాలని, డీడీటీ(డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌)ను సవరించాలని మార్కెట్‌ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో 10 శాతం

Most from this category