News


మార్కెట్లో ఆరంభలాభాలు ఆవిరి

Friday 31st January 2020
Markets_main1580455816.png-31370

  • మార్కెట్లో ఆర్థిక సర్వే గణాంకాలు, బడ్జెట్‌ అప్రమత్తత
  • 12వేల దిగువకు నిఫ్టీ 
  • గరిష్టం నుంచి 450 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
  • మెటల్‌, ఫార్మా, ఐటీ, అటో షేర్లలో అమ్మకాలు 

మిడ్‌సెషన్‌ సమయానికల్లా మార్కెట్‌ ఉదయం లాభాల్ని కోల్పోయింది. ప్రధాన సూచీలైన నిఫ్టీ 12వేల దిగువకు, సెన్సెక్స్‌ 41వేల స్థాయిని కోల్పోయింది. మరికాసేపట్లో కేంద్ర ఎకానమీ చీఫ్‌ అడ్వైజర్‌ క్రిష్ణమూర్తి  2019-20 ఆర్థిక సంవత్సరపు ఎకానమి సర్వేని విడుదల చేయనున్నారు. అలాగే రేపు లోక్‌ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలు పూనుకోవడంతో సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. కరోనా వైరస్‌ వ్యాధిని చైనా సమర్థవంతంగా ఎదుర్కోంటుందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలను అందుపుచ్చున్న దేశీయ మార్కెట్‌ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెటల్‌, ఫార్మా, ఐటీ, అటో షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మధ్యాహ్నం గం.12:10ని.లకు సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(41,154) నుంచి 452 పాయింట్లు నష్టపోయి 40,702 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ ఈ రోజు గరిష్టస్థాయి(12, 103) నుంచి 141 పాయింట్లు కోల్పోయి 11961 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇదే సమయానికి నిఫ్టీ -50 ఇండెక్స్‌లో ... కోల్‌ ఇండియా, టాటా మోటర్స్‌, ఐఓసీ, పవర్‌ గ్రిడ్‌, ఓఎన్‌జీసీ షేర్లు 2.21శాతం నుంచి 5శాతం నష్టపోయాయి. ఇన్ఫ్రాటెల్‌, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ అటో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి.

బ్యాంక్‌ నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం నుంచి 1శాతం డౌన్‌..!
మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గరిష్టం నుంచి 1శాతం నష్టపోయింది. నేటి ఉదయం ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు (30,647.40)తో పోలిస్తే 303 పాయింట్ల లాభంతో 30,950.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 30,983.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల్లో భాగంగా ఈ షేర్లు సైతం నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా ఇంట్రాడే గరిష్ట స్థాయి(30,983.30) నుంచి 1శాతం(291.5 పాయింట్లు) నష్టపోయి 30,691.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింద. మధ్యాహ్నం గం. 12:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30,647.40)తో పోలిస్తే 0.17శాతం లాభంతో 30,700.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 You may be interested

ఐబీఎం సీఈఓ గా భారతీయుడు

Friday 31st January 2020

  న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన మరో టెక్నాలజీ నిపుణుడికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన మల్టీనేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ అయిన ఐబీఎం (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ కార్పోరేషన్‌)కు భారతసంతతికి చెందిన  అరవింద్‌ కృష్ణ సీఈఓ(చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ ఆఫీసర్‌) గా నియమితులయ్యారు. ఐబీఎం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లంతా కలిసి అరవింద్‌‌ కృష్ణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కృష్ణ  ప్రస్తుతం ఐబీఎంలో క్లౌడ్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగానికి సీనియర్‌ ప్రెసిడెంట్‌గా

స్వల్పకాలానికి టాప్‌ సిఫార్సులు

Friday 31st January 2020

వచ్చే మూడు నాలుగువారాల్లో మంచి రాబడినిచ్చే మూడు సిఫార్సులను బ్రోకరేజ్‌లు అందిస్తున్నాయి. 1. బెర్గర్‌ పెయింట్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 540. స్టాప్‌లాస్‌ రూ. 585. గతేడాది జూలై నుంచి అప్‌మూవ్‌ చూపుతూ సరైన పతనం లేకుండా దాదాపు 90 శాతం దూసుకుపోయింది. చివరకు రూ. 580 వద్ద నిరోధం ఎదుర్కొంది. అప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఐ నెగిటివ్‌గా మారింది. ప్రస్తుతం షేరు కరెక‌్షన్‌ బాటలో ఉంది. 2. భారతీ ఎయిర్‌టెల్‌: కొనొచ్చు. టార్గెట్‌

Most from this category