News


బడ్జెట్‌ రోజున నష్టాలతో ప్రారంభం

Saturday 1st February 2020
Markets_main1580529996.png-31388

బడ్జెట్‌ సందర్భంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత
11900 దిగువున ప్రారంభం
50 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌

బడ్జెట్‌ రోజున జరిగే ప్రత్యేక ట్రేడింగ్‌ సందర్భంగా శనివారం దేశీయ మార్కెట్‌ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్లు నష్టంతో 40673.49 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 11,939.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవుదినం అయినప్పటికీ కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండంతో స్టాక్‌ ఎక్చ్సేంజీలు పని చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలు పూనుకున్నారు. అంతర్జాతీయంగానూ మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలు అందాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ఆందోళనల కారణంగా ప్రపంచఈక్విటీ మార్కెట్లను వృద్ధి భయాలు వెంటాడుతున్నాయి. ఫలితంగా శుక్రవారం ఆసియా, యూరప్‌, అమెరికా మార్కెట్లు 1శాతం నష్టాన్ని చవిచూశాయి.

ఉదయం గం.9:25ని.లకు సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 40623.49 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 11,926.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రవేట్‌ రంగ బ్యాంక్‌, మెటల్‌, మీడియా, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, అటో, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 

ఇదే సమయానికి... నిఫ్టీ -50 ఇండెక్స్‌లో వేదాంత, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. టాటామోటర్స్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, గెయిల్‌ షేర్లు 1వాతం నుంచి 2శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

రూ.41,000 దాటిన పసిడి

Saturday 1st February 2020

కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. చైనాలోనేగాక ఇతర దేశాల్లో కూడా వైరస్‌ కేసులు నమోదవుతుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులవైపు ఆసక్తి కనబరుస్తుండడంతో బంగారం ధర రూ.41,000పైకి చేరింది. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో రూ.700 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. 41,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 10 డాలర్లు పెరిగి

ఐటీసీ లాభం రూ.4,048 కోట్లు

Saturday 1st February 2020

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీకి ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.4,048 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.3,137 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.12,506 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.13,220 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.8,341 కోట్ల నుంచి 5

Most from this category