STOCKS

News


11300 దిగువకు నిఫ్టీ

Wednesday 24th July 2019
Markets_main1563942016.png-27265

మిశ్రమంగా ప్రారంభమైన మార్కెట్‌ క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. నిఫ్టీ 33 పాయింట్లను నష్టపోయి 11300 స్థాయిని కోల్పోయి 11,292 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెనెక్స్‌ సెంచరీ(101) పాయింట్లు పతనమై 37,881.03 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్నిరంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువ కొనసాగుతుంది. అటో, మెటల్‌ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ పావుశాతం(50 పాయింట్లు) 29,056.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీ ఎత్తున వెనక్కి తీసుకోవడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ పెరగడం, రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభం కావడం మార్కెట్‌ సెంట్‌మెంట్‌ను బలహీనపరుస్తున్నాయి.రేపు(25న) జులై డెరివేటివ్‌ సిరీస్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్‌ చేసుకునే అవకాశం ఉండటం కూడా ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా సూచీల నష్టాలకు కారణమవుతోంది. సూచీలకు ఇది వరుసగా 5రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. 

యూపీఎల్‌, బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వేదాంత, బీపీసీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, పవర్‌ గ్రిడ్‌ ఎల్‌అండ్‌, యస్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1నుంచి 1.50శాతం వరకు లాభపడ్డాయి.You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావిమయ్యే షేర్ల వివరాలు  రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌:- ఎన్‌ఎస్‌ఈ ఎ‍క్చే‍్సంజ్‌ ఎఫ్‌అండ్‌ఓ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 27 నుంచి ఇది అమల్లోకి రానుంది.  స్టెరైడ్స్‌ ఫార్మా సైన్స్‌:- మే 29న బెంగూళూర్‌లో ఫార్మూలేషన్‌ ఫ్యాకల్టీ యూనిట్‌ను తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఈఐఆర్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. డెక్కెన్‌ హెల్త్‌కేర్‌:- జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించేందుకు తన అనుబంధ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందానికి​ బోర్డు ఏకగ్రీవంగా

తగ్గిన అమెరికా నిల్వలు..పెరిగిన చమురు

Wednesday 24th July 2019

అమెరికా చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా తగ్గడంతో పాటు అమెరికా నావీ గత వారం ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేశామని ప్రకటించడంతో బుధవారం క్రూడ్‌ ఆయిల్‌ తన లాభాలను కొనసాగిస్తోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌కు 0.4 శాతం పెరిగి 64.07 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.21 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం, డబ్యూటీఐ

Most from this category