News


3వేల పాయింట్లు పతనమైన బ్యాంక్‌ నిఫ్టీ..!

Monday 23rd March 2020
Markets_main1584952701.png-32635

మార్కెట్‌ మహాపతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 15శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా 17రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 వరకు ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్‌ భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(20317.60)తో పోలిస్తే 2006 పాయింట్లు(10 శాతం) నష్టంతో 18,311.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాలు మరింత తీవ్రతరం కావడంతో ఇండెక్స్‌ ఒకదశలో 3092 పాయింట్లు(15.22శాతం) నష్టపోయి 17224.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 10శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 15శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 12.50శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 15శాతం నష్టాన్ని చవిచూశాయి.  మధ్యాహ్నం 2గంటలకు ఇండెక్స్‌ శుక్రవారం ముగింపు(20,317.60)తో పోలిస్తే 15శాతం నష్టంతో 17,284.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

రూ.2 లక్షలకోట్ల సంపద కోల్పోయిన ఎల్‌ఐసీ

Monday 23rd March 2020

కరోనా వైరస్‌ దాటికి ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం, ప్రపంచ కుబేరుల సంపద ఆవిరైపోతున్న తరుణంలో తాజాగా లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ)సంపదలో రూ.2 లక్షల కోట్లను కోల్పోయింది. కరోనా ప్రభావంతో ఎల్‌ఐసీ తన ఈక్విటీ పోర్ట్‌పోలియోలో రూ.1.84 లక్షల కోట్లను కోల్పోయింది.  ప్రపంచ, దేశీయ ఆర్థిక వృద్ధిపై కరోనా ప్రభావం పడడంతో కుబేరులతోపాటు కంపెనీలు తమ సంపదను కోల్పోతున్నాయి. వార్షిక ప్రాతిపదికన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు మార్చి

బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ "బేర్‌'

Monday 23rd March 2020

సెన్సెక్స్‌ 3490 పాయింట్లు డౌన్‌ 1004 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మెటల్‌, రియల్టీ విలవిల లోయర్‌ సర్క్యూట్‌తో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి ట్రేడింగ్‌ ప్రారంభమయ్యాక మరింత తిరోగమించాయి. మధ్యాహ్నం 12 కల్లా సెన్సెక్స్‌ 3490 పాయింట్లు పడిపోయి 26426కు చేరగా.. నిఫ్టీ 981 పాయింట్లు దిగజారింది. 7741 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్‌ 26,500 దిగువకు చేరగా.. నిఫ్టీ 8,000 పాయింట్లనూ కోల్పోవడం గమనార్హం!   అమ్మకాల షాక్‌ అమ్మకాల ఉధృతికి ఎన్‌ఎస్‌ఈలో అన్ని

Most from this category