News


బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం జంప్‌..!

Tuesday 4th February 2020
Markets_main1580795664.png-31494

మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో భాగంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2.25శాతం పెరిగింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,235.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2.25శాతం పెరిగి 30,696.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 11:00లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు (30,023.25)తోప పోలిస్తే 2శాతం లాభంతో 30,637.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 3శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు 2.50శాతం ర్యాలీ చేయడం ఇండెక్స్‌ భారీగా లాభపడేందుకు కారణమైంది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2నుంచి 1శాతం పెరిగాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు అరశాతం లాభపడ్డాయి. అయితే ఒక్క యస్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 3శాతం నష్టపోయింది. 



You may be interested

ఈ షేర్లలో ర్యాలీ?!

Tuesday 4th February 2020

ఎంఏసీడీ సంకేతాలు మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 4th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు నేడు బోర్డు సమావేశాలు నిర్వహించే కంపెనీలు..  ఆదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, అవంతీ ఫీడ్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, బల్‌మర్‌ లారై అండ్‌ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఆరికిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సాఫ్ట్‌వేర్‌, పిరమాళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, టాటా గ్లోబల్‌ బేవరేజస్‌, థర్‌మ్యాక్స్‌, టైటాన్‌ కంపెనీ, టీవిఎస్‌ మోటార్‌

Most from this category