News


బ్యాంక్‌ నిప్టీ 1శాతం అప్‌

Tuesday 6th August 2019
Markets_main1565066465.png-27560

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఒకశాతం లాభపడింది. నిన్నటి రోజు భారీ పతనం నేపథ్యంలో నేడు మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,518.50 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ రికవరీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడుతుడంతో ఈ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 1శాతం వరకు లాభపడి 27928.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:40ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(27,648.05)తో పోలిస్తే 0.75శాతం(204 పాయింట్లు) లాభంతో 27,852.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన ఎస్‌బ్యాంక్‌ అత్యధికంగా 4శాతం లాభపడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.50శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2శాతం పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.50శాతం ర్యాల చేశాయి. అలాగే ఎస్‌బీఐ అరశాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.10శాతం లాభపడింది. అయితే కోటక్‌ బ్యాంకు షేరు మాత్రం అరశాతం స్వల్ప నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మద్దతు స్థాయి 27400గానూ, నిరోధ స్థాయి 28200 వద్ద ఉంటుదని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



You may be interested

స్వల్పంగా పెరిగిన చమురు

Tuesday 6th August 2019

చమురు ధరులు మంగళవారం ట్రేడింగ్‌లో పెరిగినప్పటికి, అంతర్జాతీయ వాణిజ్య భయాల వలన చమురు డిమాండ్‌ ఆందోళనలు మదుపర్లను వెంటాడుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్ 10 సెంట్లు లేదా 0.17 శాతం పెరిగి బ్యారెల్కు  59.91 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్ల్యుటిఐ క్రూడ్‌ ఫ్యూచర్స్ 7 సెంట్లు లేదా 0.13 శాతం పెరిగి బ్యారెల్కు 54.76 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద చమురు వినియోగదారుల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 6th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  యస్‌ బ్యాంక్‌:- మూడీస్‌ రేటింగ్‌ సంస్థ రెండు నెలల్లోనే రెండుసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆ‍స్తుల నాణ్యత తగ్గడం, షాడో బ్యాంకులకు భారీగా రుణాలిచ్చి ఉండటంతో బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్‌ వెల్లడించింది. గతంలో బ్యాంక్‌కు కేటాయించిన ధీర్ఘకాలిక కరెన్సీ ఇష్యూకు ‘‘బీఎ1’’ రేటింగ్‌ను కొనసాగించే రేటింగ్‌ను పరిశీస్తున్నట్లు తెలిపింది.  బ్రిక్స్‌వర్క్స్‌ రేటింగ్‌ లోయర్‌ టైర్‌

Most from this category