News


బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం అప్‌

Wednesday 3rd July 2019
Markets_main1562140417.png-26763

స్వల్ప లాభనష్టాల మధ్య కన్సాలిడేషన్‌ దిశగా సాగుతున్న మార్కెట్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సూచీ నేడు 31,347.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ అరశాతం(170పాయింట్లు) పెరిగి 31449.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మద్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(31283.30)తో పోలిస్తే 150 పాయింట్ల 31433 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4శాతం లాభపడింది. బ్యాంకు ఆఫ్‌ బరోడా 2.50శాతం, ఫెడరల్‌ బ్యాంకు 1.50శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంక్‌ 1శాతం లాభపడింది. అలాగే యస్‌ బ్యాంక్‌ అరశాతం పెరగ్గా, ఎస్‌బీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పావుశాతం ర్యాలీ చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు స్వల్పంగా 0.10శాతం లాభపడింది. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు షేర్లు 0.10శాతం నష్టపోయాయి. 

ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 73పాయింట్లు పెరిగి 39,889.48 వద్ద, నిఫ్టీ 20పాయింట్లు లాభపడి 11,930.55 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య తలెత్తిన వాణిజ్య సుంకాల విధింపు సమస్యలు ఏ మేరకు ప్రభావాన్ని చూపుతాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లుండి కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఫలితంగా సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి.



You may be interested

స్మాల్‌క్యాప్‌ సూచీ.. పరుగులకు రెడీ!

Wednesday 3rd July 2019

దేశీయ మార్కెట్లో చిన్న స్టాకుల సందడి మొదలైతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ పునరుజ్జీవ సంకేతాలు వెలువరిస్తోందని టెక్నికల్‌ నిపుణులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా ప్రధాన సూచీతో పోలిస్తే స్మాల్‌క్యాప్‌ సూచీ పేలవ ప్రదర్శన చూపుతోంది. గతేడాది కాలంలో నిఫ్టీ 11.34 శాతం ర్యాలీ జరపగా, స్మాల్‌క్యాప్‌ సూచీ 12.53 శాతం మేర పతనమైంది. నిఫ్టీ, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 మధ్య పదేళ్ల సరాసరి ప్రదర్శన పోలిస్తే ఈ

త్వరలోనే యాడ్‌ల్యాబ్స్‌ సమస్య కొలిక్కి

Wednesday 3rd July 2019

సెప్టెంబర్‌ కంటే ముందే పరిష్కారం !  ముంబై: యాడ్‌ల్యాబ్స్‌ బకాయిల సమస్య ఈ ఏడాది సెప్టెంబర్‌ కంటే ముందే పరిష్కారం కానున్నదని సమాచారం. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) లో కాకుండా బయటనే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూనియన్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని 13 బ్యాంక్‌ల కన్సార్షియమ్‌ యాడ్‌ల్యాబ్స్‌కు రూ.1,100 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈ రుణాల వసూళ్ల కోసం ఈ బ్యాంక్‌లు యాడ్‌ల్యాబ్స్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని

Most from this category