News


5నెలల గరిష్టానికి నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ

Monday 25th November 2019
Markets_main1574673676.png-29838

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో కొనుగోళ్లు జరగడంతో సూచీలు రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 505 పాయింట్లు పెరిగి 40,868.30 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 153 పాయింట్ల ఆర్జించి 12,067.05 వద్ద 5నెలల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 453 పాయింట్లు లాభపడి 31,564.60 వద్ద 5నెలల గరిష్టాన్ని అందుకుంది. ఈ నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ సూచీలు జూన్‌ తొలివారంలో ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిని తాకిన తర్వాత, దాదాపు ఆ స్థాయికి అరశాతం దూరంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ట్రేడవుతున్నాయి. ఒక్క మీడియా షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా మెటల్‌ రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు  సూచీల రికార్డు ర్యాలీకి తోడ్పాటునిస్తున్నాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు నిఫ్టీ క్రితం ముగింపు(11,914.40)తో పోలిస్తే 133 పాయింట్లు లాభంతో 12047 వద్ద, సెన్సెక్స్‌ 439 పాయింట్లు లాభంతో 40,793 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
బ్యాంక్‌ నిఫ్టీ :-
ప్రైవేట్‌ రంగ బ్యాంకుల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 5నెలల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఈ ఇండెక్స్‌ 31,065.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ అరశాతం లాభంతో పాటు ఎస్‌బీఐ 2శాతం పెరగడంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 453 పాయింట్లు లాభపడి 31,564.60 వద్ద 5నెలల గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.2:30ని.లకు నిఫ్టీ క్రితం ముగింపు(31,111.60)తో పోలిస్తే 405.20 పాయింట్లు(1.30శాతం) లాభంతో 12047 వద్ద, సెన్సెక్స్‌ 439 పాయింట్లు లాభంతో 40,793 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

జీవిత బీమా తీసుకుంటున్నారా? అయితే ఇంకో వారం ఆగండి!

Monday 25th November 2019

కొత్తగా జీవిత బీమా పాలసీలను ఈ నెల 30 లోపు తీసుకోమని ఎజెంట్లు తొందర పెడుతున్నారా? అయితే ఆచితూచి అడుగేయాల్సిందే. ఎందుకంటే జీవిత బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ (ఇన్సురెన్స్‌ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) కొత్త మార్గదర్శకాలు డిసెంబర్‌ 1 వ తేది నుంచి అమలులోకి రానున్నాయి. అందుకే జీవిత బీమా పంపిణిదారులు పాలసీలు తీసుకోమని వినియోగదారులను తొందరపెడుతున్నారని పరిశీలకులు తెలిపారు. ‘కొత్త ప్లాన్‌లలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా

6శాతం పెరిగిన భారతీ ఎయిర్‌టెల్‌

Monday 25th November 2019

గతవారంలో వరుస మూడు ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాలను చవిచూసిన భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ఈ వారం మొదటిరోజే లాభాల బాట పట్టింది. బీఎస్‌ఈలో సోమవారం ఈ కంపెనీ షేరు రూ.421.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెల్కోల రాబడి (ఏజీఆర్‌)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్‌టెల్‌తో పాటు వోడాఫోన్‌ కంపెనీ శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. మరోవైపు సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్‌ సంస్థ కంపెనీ షేరుకు రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో

Most from this category