News


నిఫ్టీ బ్యాంకు ర్యాలీకి కారణాలివే..

Friday 13th December 2019
Markets_main1576259558.png-30215

శుక్రవారం ప్రభుత్వరంగ బ్యాంకులు టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. ఎస్సార్‌ స్టీల్‌ దివాలా పరిష్కార కేసులో బ్యాంకులకు చెల్లింపులు ఈ నెలలోనే ఉంటాయన్న వార్తలు ర్యాలీకి కారణమయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ ఏకంగా 3.66 శాతం పెరిగి 2,561.60కు చేరుకుంది. నిఫ్టీ బ్యాంకు సూచీ కూడా కీలకమైన 32,000 మార్క్‌పైకి చేరింది. యూనియన్‌బ్యాంకు, ఓబీసీ, కెనరా బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ స్టాక్స్‌ 1-7 శాతం మధ్యలో పెరిగాయి. యూకో బ్యాంకు అయితే 12 శాతం, కార్పొరేషన్‌ బ్యాంకు 13 శాతం ర్యాలీ చేశాయి. ప్రైవేటు రంగంలోని యాక్సిస్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు సైతం పెరిగాయి.

 

‘‘రుణదాలు ఎస్సార్‌ స్టీల్‌ దివాలా కేసును ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేసి రెండేళ్లవుతోంది. ఇది ముగింపునకు వచ్చింది. పరిష్కారం ఈ నెల 16న పూర్తి కావచ్చు. అలాగే, రుచి సోయా, భూషణ్‌ పవర్‌ దివాలా కేసుల పరిష్కారం కూడా ఈ నెల్లోనే పూర్తి కానున్నాయి’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎస్సార్‌ స్టీల్‌, రుచిసోయా పరిష్కారం ఈ నెల 16 నాటికి పూర్తవుతుందని, భూషణ్‌ పవర్‌ కేసు మాత్రం ఈ నెలాఖరుకు పరిష్కారమవుతుందని వెల్లడించాయి. ఇదే జరిగితే ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులకు సానుకూలం. వీటి బకాయిలు వెనక్కి రానున్నాయి. ఎస్సార్‌ స్టీల్‌ను ఆర్సెలర్‌ మిట్టల్‌ రూ.42,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన పరిష్కారానికి గత నెల సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్‌సీఎల్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఈ ఏడాది జూలై 4న ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31లోపు ఎస్సార్‌ స్టీల్‌ సెక్యూర్డ్‌ రుణదాతలకు రూ.42,000 కోట్లను ఆర్సెలర్‌ మిట్టల్‌ చెల్లించేందుకు అనుమతి మంజూరు చేసింది. 



You may be interested

నవంబర్‌లో ఫండ్స్‌ షేర్ల షాపింగ్‌

Friday 13th December 2019

నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడుల రాక అంతక్రితం నెలతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. యాంఫి గణాంకాల ప్రకారం నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.1,311 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో ఇవి రూ.6,026 కోట్లుగా ఉన్నాయి. ‍కాకపోతే సిప్‌ రూపంలో పెట్టుబడులు నవంబర్‌లో రూ.8,272 కోట్లకు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. అక్టోబర్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.8,245 కోట్లుగా ఉన్నాయి. నవంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని

41వేల పైన ముగిసిన సెన్సెక్స్‌

Friday 13th December 2019

115 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  కలిసొచ్చిన అంతర్జాతీయ అంశాలు రాణించిన మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్‌ శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 428 పాయింట్లు పెరిగి 41వేల పైన 41,010 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115 పాయింట్లను ఆర్జించి 12,087 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండున్నర నెలల గరిష్టానికి బలపడటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది.  అమెరికా చైనాల మధ్య

Most from this category