News


ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ: లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 8th November 2019
Markets_main1573190446.png-29444

ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తున్న కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,571.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆల్‌టైం స్థాయికి అందుకోవడం, యస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 1.50శాతం వరకు ర్యాలీ చేశాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో 0.60శాతం పెరిగి 30,817.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:30ని.కు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30633.15)తో పోలిస్తే 0.25శాతం లాభంతో 30,708.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ షేర్లు 1శాతం నుంచి 0.10శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. 


 



You may be interested

ఈ షేర్లపై ఎంఎస్‌సీఐ ప్రభావం

Friday 8th November 2019

మోర్గాన్‌స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) తాజాగా తన సూచీలను సమీక్షించింది. ఇందులో భాగంగా పలు భారతీయ కంపెనీల షేర్లను తన సూచీల్లో కలపడం, తీసివేయడం జరిపింది. ఈ ప్రభావం శుక్రవారం ట్రేడింగ్‌లో ఆయా కంపెనీల షేర్లపై కనిపిస్తోంది.  - కొత్తగా ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో స్థానం సంపాదించిన డీఎల్‌ఎఫ్‌ షేరు ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 6 శాతం లాభపడింది.  - అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు దాదాపు 4 శాతం పైన, ఇంద్రప్రస్థగ్యాస్‌ దాదాపు

ఎంఎస్‌సీఐలో డీఎల్‌ఎఫ్‌..షేరు 6% అప్‌

Friday 8th November 2019

మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) దేశీయ ఇండెక్స్‌కి సంబంధించి డీఎల్‌ఎఫ్‌ను తన పోర్టుఫోలియోకి జోడించింది. ఫలితంగా ఈ షేరు శుక్రవారం సెషన్‌లో 6 శాతం లాభపడి ట్రేడవుతోంది. అంతేకాకుండా కంపెనీ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 19 శాతం వృద్ధి చెందింది. ఈ అంశాలతో పాటు నిలిచిపోయిన ఇళ్ల ప్రోజెక్టులను పూర్తిచేసేందుకు, కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సహకారంతో రూ. 25,000 కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి

Most from this category