News


ఒడిదుడుకుల్లో బ్యాంకు నిఫ్టీ

Tuesday 2nd July 2019
Markets_main1562057239.png-26741

బ్యాంకు నిప్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,414.65 వద్ద ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మార్కెట్‌ ర్యాలీలో భాగంగా క్రితం ముగింపు(31,372.20)తో పోలిస్తే 142 పాయింట్లు పెరిగి 31,431.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్‌లో జరిగి అమ్మకాలతో ఇండెక్స్‌ తిరిగి నష్టాల్లోకి మళ్లింది. ఫలితంగా ఇండెక్స్‌ ఇంట్రాడే గరిష్టం (31,431.35) నుంచి సుమారు 326 పాయింట్లను కోల్పోయి 31,105.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం సమయానికి తిరిగి రివకరిని సాధించి 50 పాయింట్ల నష్టంతో 31,320.15 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. యస్‌ బ్యాంక్ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. యాక్సిస్‌ బ్యాంక్‌ 2శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో ఎస్‌బీఐ బ్యాంకు అరశాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు పావుశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 39,782 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,889.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

హెచ్‌డీప్‌సీ ద్వయం...రికార్డు హై

Tuesday 2nd July 2019

ఒడిదుడుకుల మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రికార్డు గరిష్టాలను అందుకున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ:- నేడు హెచ్‌డీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌లో రూ.2,256.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 1.50శాతం లాభపడి రూ.2,278.50ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గతముగింపు(రూ.2,245.90)తో పోలిస్తే 1.40శాతం లాభంతో రూ.2,277.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది

రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2.5 లక్షల కోట్లు!

Tuesday 2nd July 2019

అనధికార మార్కెట్లో భారీ ధరకు లావాదేవీలు రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో నమోదుకానుందనే వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లకు అనధికార మార్కెట్లో డిమాండ్‌ పెరిగింది. రిటైల్‌ రంగంలోని మిగిలిన కంపెనీల కంటే ఈ కంపెనీ విలువ ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అనధికార మార్కెట్లో ఈ షేరు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.5 లక్షల కోట్లకు చేరిందని,  నమోదైనా ఏడు ప్రత్యర్థి కంపెనీల మొత్తం మార్కెట్‌క్యాప్‌ కంటే  75 శాతం ఎక్కువని భావిస్తున్నారు.

Most from this category